FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇటీవల చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచే ప్రతిపాదన చేశాయి. ఇటీవల రెపో పేటు పెరిగిన తరువాత దాదాపుగా అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఇంకా 9 శాతం వడ్డీ ఇవ్వకపోయినా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు మాత్రం 9 శాతం వడ్డీ ఇస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
FD Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంత తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులేవో పరిశీలిద్దాం..ఏ బ్యాంకు ఏ మేరకు ఇస్తుందో ఆ వివరాలు మీ కోసం..
ఇక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 9 శాతంగా ఉంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 9.60 వరకూ వడ్డజీ ఇస్తోంది. 9 శాతం నుంచి గరిష్టంగా 9.60 శాతం వడ్డీ ఇస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.25 శాతం నుంచి 9 శాతం వరకూ వడ్డీ అందిస్తోంది. ఇది కాల పరిమితిని బట్టి మారుతుంటుంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 9.11 శాతానికి పెంచింది. ఇది సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ. సామాన్యులకు 8.51 శాతం వడ్డీ అందిస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారమ పౌరులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 9.50 శాతం వడ్డీ ఇస్తోంది. ఎఫ్‌డి కాల పరిమితిని బట్టి వడ్డీ 9.25 శాతం నుంచి 9.50 శాతం ఉంది.