Annual Recharge Plans: వన్‌టైమ్ రీఛార్జ్ కోసం ఎదురుచూసేవారికి, డబ్బులు ఆదా చేయాలనుకునేవారి కోసం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ఏడాది వ్యాలిడిటీ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ సైతం సరికొత్త వార్షిక ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని టెలీకం రంగంలో ప్రధాన పోటీ రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ మధ్యనే ఉంది. పోటీని ఎదుర్కొంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్యాకేజ్‌లు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ నుంచి కొత్తగా రెండు వార్షిక ప్లాన్స్ ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం..


ఎయిర్‌టెల్ 1799 రూపాయల వార్షిక ప్లాన్


ఏడాది ప్లాన్ 365 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. 3600 ఎస్ఎంఎస్‌లు, 24 జీబీ డేటా వర్తిస్తుంది. 24 జీబీ డేటా అనేది మొత్తం ఏడాదికి వర్తిస్తుంది. ఎస్ఎంఎస్‌లు కూడా రోజుకు 100 ఉంటాయి. డేటాకు పరిమితి ఉండదు. ఏడాదిలో ఎప్పుడైనా 24 జీబీ వాడుకోవచ్చు. ఇది కాకుండా హెల్లో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితంగా పొందవచ్చు. 


ఇదే వార్షిక ప్లాన్‌లో డేటా ఎక్కువ కావాలంటే ఏడాదికి 2,999 రూపాయల ప్లాన్ ఉంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇతర ప్రయోజనాలు యధాతధంగా లభిస్తాయి.


జియో 2879 వార్షిక ప్లాన్


జియోలో అద్భుతమైన బడ్జెట్ ప్లాన్ ఇది. ఇందులో 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్ ధర 2879 రూపాయలు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్, జియో సినిమా, జియో టీవీ యాక్సెస్ ఉంటాయి. 5జి నెట్‌వర్క్ ఎంజాయ్ చేయవచ్చు. అదే 2,999 రూపాయల ప్లాన్‌లో అయితే రోజుకు డేటా 2.5 జీబీ లభిస్తుంది. మిగిలినవన్నీ సేమ్ ఉంటాయి. ఇక మరో ప్లాన్ కేవలం 2,545 రూపాయలు మాత్రమే. ఇది కూడా వార్షిక ప్లాన్ అయినా 336 రోజులే వర్తిస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా ఉంటుంది. జియోలో ఇది అత్యంత ఎకానమీ ప్లాన్‌గా చెప్పవచ్చు.


వోడాఫోన్ ఐడియా 1799 ప్లాన్


వోడాఫోన్ ఐడియా అందించే వార్షిక ప్లాన్ ఇది. ఎయిర్‌టెల్ అందించే 1799 రూపాయల ప్లాన్ లాంటిదే. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 24 జీబీ డేటా లభిస్తుంది. ఇక వోడాఫోన్ ఐడియాలో మరో ప్లాన్ 2,899 రూపాయలు. ఇందులో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్ కాలింగ్, వీఐ మూవీస్, టీవీ యాప్ యాక్సెస్ ఉంటుంది. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 వరకూ అన్‌లిమిటెడ్ డేడా పొందవచ్చు. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా అదనంగా 50 జీబీ డేటా అందిస్తుంది. 


Also read: Jio offers Netflix: ఈ రెండు జియో ప్లాన్స్ తీసుకుంటే..నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook