Jio offers Netflix: ఈ రెండు జియో ప్లాన్స్ తీసుకుంటే..నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితం

Jio offers Netflix: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రముఖ ఓటీటీ సేవల్ని కూడా ఉచితంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 18, 2023, 01:26 PM IST
Jio offers Netflix: ఈ రెండు జియో ప్లాన్స్ తీసుకుంటే..నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఉచితం

Jio offers Netflix: దేశంలోని టెలీకం కంపెనీల్లో రిలయన్స్ జియో స్థానం ప్రత్యేకమైంది. ఆకర్షణీయమైన పధకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. టెలీకం ప్లాన్స్‌‌తో ఉచితంగా అందించే ఓటీటీ సేవలతో మార్కెట్ పెంచుకుంటోంది. ఈ క్రమంలో ఈసారి సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది.

ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రముఖమైంది, ప్రత్యేకమైంది నెట్‌ఫ్లిక్స్, సాధారణంగా టెలీకం కంపెనీలు తమ ప్లాన్స్‌తో పాటు ఉచితంగా వివిధ రకాల ఓటీటీ సేవలు అందిస్తుంటాయి. కానీ వేటిలోనూ నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందదు. అయితే ఇప్పుడు తొలిసారిగా రిలయన్స్ జియోకు చెందిన రెండు ప్రీ పెయిడ్ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా ఆస్వాదించవచ్చు. ఈ రెండు ప్లాన్స్ 1099 రూపాయలు, 1499 రూపాయలుగా ఉన్నాయి. ఈ రెండు ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

రిలయన్స్ జియో 1099 ప్లాన్

జియో 1099 రూపాయల ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. జియో 5జి వెల్కం ఆఫర్ అందుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా 5జి డేటా అన్‌లిమిటెడ్ ఉంటుంది. దీంతోపాటు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ కనెక్షన్, జియో టీవి, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచితంగా అందుతాయి.

రిలయన్స్ జియో 1499

రిలయన్స్ జియో 1499 రూపాయల ప్లాన్‌లో 5జి వెల్కం ఆఫర్ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ లతోపాటు అదనంగా 40 జీబీ డేటా పొందవచ్చు. ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్యాకేజ్‌లో అదనంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జియో టీవి, జియో సినిమా, జియో క్లౌడ్ ఉంటాయి. 

Also read: IRCTC Tour Package: అందమైన ఊటీ అనుభవం ఆస్వాదించే ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News