Boat Smart Ring Price: Boat స్మార్ట్ రింగ్ వచ్చేసింది..కొత్త కొత్త ఫీచర్స్‌తో ఫిదా చేస్తోంది!
Boat Smart Ring Price: అందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బోట్ స్మార్ట్ రింగ్ మార్కెట్‌లోకి వచ్చేంది. ఈ స్మార్ట్ రింగ్ చాలా రకాల కొత్త ఫీచర్స్‌తో లభిస్తోంది. ఇందులో స్వైప్ నావిగేషన్ ఫంక్షన్‌తో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Boat Smart Ring Price In India Flipkart: టెక్నాలజీ పెరగడం కారణంగా మనుషుల్లో రోజురోజుకూ తెలివి తేటలు పెరుగుతున్నాయి. టెక్ కంపెనీ కూడా మారుతున్న మనుషులను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ ఫోన్స్, వాచ్‌లు, బ్యాండ్‌ల రూపంలో కొత్త టెక్నాలజీని అందిస్తున్నాయి. అంతేకాకుండా ఈ జాబితాలోకి స్మార్ట్ రింగ్‌లు కూడా చేరాయి. ప్రముఖ టెక్ కంపెనీ బోట్ మార్కెట్‌లోకి స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ రింగ్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌య అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బోట్ రింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ రింగ్‌ను కంపెనీ ఆగస్టు 28వ తేదిన మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ బోట్ రింగ్‌ను కంపెనీ మొత్తం 3 సైజుల్లో విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో 17.40mm, 19.15mm, 20.85mm సైజెస్‌లో లభిస్తోంది. ఈ రింగ్ స్మార్ట్ టచ్ కంట్రోల్స్‌తో పాటు స్వైప్ నావిగేషన్ ఫంక్షన్ కలిగి ఉంటుంది. ఇక బోట్ డిజైన్ పరంగా ఏ మాత్రం తగ్గకుండా సిరామిక్ డిజైన్‌తో ఈ రింగ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు అనేక రకాల బాడీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
ప్రస్తుతం ఈ బోట్ స్మార్ట్ రింగ్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండు వెబ్‌సైట్స్‌లో లభిస్తున్నాయి. ఇక ఈ రింగ్ ధర విషయానికొస్తే..కంపెనీ రూ.8,999లతో విక్రయిస్తోంది. అయితే మున్ముందు ఈ రింగ్‌పై ఈ కామర్స్ కంపెనీల్లో డిస్కౌంట్ ఆఫర్స్‌కు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రింగ్‌కి సంబంధించి స్టాక్ మొత్తం విక్రయించడంతో.. ఈ కామర్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో స్టాక్ మొత్తం నిల్..అయితే దీనికి పోటీగా త్వరలోనే నాయిస్ కంపెనీ రింగ్ కూడా విడుదల కాబోతోంది.
బోట్ స్మార్ట్ రింగ్ స్పెసిఫికేషన్స్:
✤ స్మార్ట్ టచ్ కంట్రోల్స్
✤ మ్యూజిక్ ప్లే కంట్రోల్స్
✤ స్వైప్ నావిగేషన్ ఫంక్షన్
✤ వీడియో రికార్డింగ్ ఆప్షన్
✤ ఫోటో క్లిక్ ఫీచర్
✤ హార్ట్ బీట్ మానిటర్ సెన్సార్
✤ SpO2 సెన్సార్
✤ బాడీ టెంపరేచర్ మానిటర్
✤ స్లీప్ ట్రాకింగ్
✤ యాక్సిస్ మోషన్ సెన్సార్ సిస్టమ్
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి