Dead Cheap Mobile: డెడ్ ఛీప్‌గా Samsung Galaxy F13.. ధరేంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Dead Cheap Samsung Mobile: కాలం మారుతున్న కొద్ది అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అయితే శాంసంగ్ కూడా బడ్జెట్ ధరలో ఇటీవలే ఓ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరకే మార్కెట్‌లో లభిస్తోంది.
Dead Cheap Samsung Mobile: శాంసంగ్ ఫోన్స్‌కి ఇండియా మార్కెట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ మొబైల్స్ బడ్జెట్ ధరల్లోనే కాకుండా కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కూడా శాంసంగ్ తక్కెవ ధరల్లోనే ఫోన్లను లాంచ్ చేయడం విశేషం. అయితే ఇటీవలే శాంసంగ్ బడ్జెట్ ధరలో ఇంకొ ఫోన్‌ను విడుదల చేసింది. Galaxy F13 అనే మోడల్‌తో లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం భారత్‌లో రెండు వెరియంట్స్‌లో లభిస్తోంది.
భారత మార్కెట్, ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్స్‌లో ఈ ఫోన్ ధర రూ. 11,999 కాగా 4 GB RAMతో 128 GB స్టోరేజ్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది అన్ని ఫోన్ల బ్యాటరీల్లా కాకుండా అధికంగా లైఫ్‌ను ఇస్తుంది. దీని ధర తక్కువగా ఉండడం వల్ల సామన్య వినియోగదారులు కూడా దీనిని సులభంగా కొనుగోలు చేయోచ్చు. అయితే ఇంకా తక్కువ ధరకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లికార్ట్‌లో యాక్సెస్ బ్యాక్ క్రెడిట్ కార్డులో చేస్తే దాదాపు 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతో వినియోగదారులకు రూ. 9,600తో లభిస్తుంది. అంతేకాకుండా SBI క్రెడిట్ కార్డుపై కూడా ఆఫర్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 3,000 క్యాష్ బ్యాక్ కూపన్ కూడా పొందొచ్చు.
ఎక్చేజ్ ఆఫర్:
ఈ ఫోన్‌పై ఎక్చేజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఎక్చేజ్ ఆఫర్‌ను వినియోగించి మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 11,050 దాకా డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఇది మీ ఫోన్ కండిషన్‌ని బట్టి మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చెజ్ చేసే క్రమంలో మీ పాత ఫోన్ ఎలాంటి డెంట్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అధిక శాతం డిస్కౌంట్ పొందాలనకుంటే తప్పకుండా మీరు ఎక్చేజ్ ఆఫర్‌ను వినియోగించాల్సిందే.
ఇందులో ఉండే ఫీచర్లు:
ప్రస్తుతం ఈ ఫోన్ వాటర్‌ఫాల్ బ్లూ, సన్‌రైజ్ కాపర్, నైట్‌స్కీ గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు బాక్సులో ఛార్జర్ కూడా లభిస్తుంది. ఇక బాడీ ఫ్యానెల్ విషయానికొస్తే వెనుక ప్యానెల్ ప్లాస్టిక్, డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్‌తో మార్కెట్‌లో లభిస్తుంది. ఇక అవుట్ సౌండ్ విషయానికొస్తే దిగువన సింగిల్ స్పీకర్ ఉండనుంది. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు హెడ్‌ఫోన్ జాక్ లభిస్తోంది. ఇక ఇది కల్లు చెదిరే డిజైన్‌తో మార్కెట్‌లో లభించనుంది.
Also Read: Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!
Also Read: Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.