Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?

Pushpa Russia release : పుష్ప సినిమా రష్యా రిలీజ్ ఈ నెల మొదట్లోనే అయినా అక్కడ ప్రమోషన్స్ కు వెళ్లి వచ్చింది, అయితే ఈ సినిమా భారీ నష్టాన్ని కలిగించిందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 20, 2022, 12:45 PM IST
Pushpa Russia Release: 'పుష్ప' భజన మాములుగా లేదు కానీ.. మూడు కోట్లు లాసా?

Pushpa Russia release Creates 3 Crores loss: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన పుష్ప ది రైజ్ అంటే పుష్ప మొదటి భాగం ఎంత పెద్ద సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా హిందీలో కూడా అధిక కలెక్షన్లు రాబట్టి సుమారు 400 కోట్ల దాకా కలెక్షన్లు రాబట్టినట్టయింది. ఇక ఈ సినిమాని డిసెంబర్ 8వ తేదీన రష్యన్ థియేటర్లలో విడుదల చేశారు. బాక్సాఫీస్ నిపుణులు ఈ సినిమా రష్యా మార్కెట్లో మంచి వసూళ్లు రాబడుతుంది అని భావించారు. ఆ వసూళ్లను మరింత పెంచుకునేందుకు పుష్ప టీం మొత్తం రష్యా వెళ్ళింది.

అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన కూడా అక్కడికి వెళ్లి సినిమాని ప్రమోట్ చేశారు. అంతేకాక కొన్ని స్పెషల్ ప్రమోషన్స్ కూడా చేశారు. టీవీ ఇంటర్వ్యూలు, రేడియో ఇంటర్వ్యూలు సహా ఎన్ని ప్రమోషనల్ స్ట్రాటజీలు చేయాలో అన్నీ చేశారు. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, హీరోయిన్ రష్మిక మందన, మైత్రి మూవీ మేకర్స్ యూనిట్ కూడా రష్యా వెళ్ళింది. ఇంత మంది వెళ్లారు అంటే ఏదో భారీగానే అక్కడ జరుగుతుందని అందరూ భావించారు.

అయితే రష్యా ప్రజలు మాత్రం ఎందుకో ఈ సినిమా మీద ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని రష్యన్ భాషలోకి డబ్బింగ్ చేసేందుకు సినిమా యూనిట్ మొత్తం అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేసేందుకు దాదాపుగా మూడు నుంచి ఐదు కోట్ల దాకా ఖర్చయిందని తెలుస్తోంది. అక్కడ వచ్చిన వసూళ్లను బట్టి చూస్తే దాదాపుగా మూడు కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. పుష్ప సినిమా థియేటర్లకు జనాలు రాకపోవడంతో మూడు రోజుల్లోనే సినిమా థియేటర్ల నుంచి పుష్ప సినిమా తీసేశారని చాలా దారుణమైన పరిస్థితుల్లో అక్కడ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని తెలుస్తోంది.

అందుకే రష్యా వెళ్ళినప్పుడు హడావిడి చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సినిమా యూనిట్ ఇప్పుడు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇదంతా చూస్తుంటే రష్యాలో పుష్ప సినిమాని విడుదల చేయడం మాత్రం ఒక భారీ లాస్ అనే చెప్పాలి. అయితే దీనికి భిన్నంగా నిన్న జరిగిన 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎస్కేఎన్ అల్లు అర్జున్ గురించి పుష్ప సినిమా గురించి పొగడ్తలు వర్షం కురిపించారు.

Also Read: Kiccha Sudeep: చెప్పుతో కొడతారా? పునీత్ ఉండి ఉంటే ఆయన సమర్థిస్తారా?

Also Read: Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 
 

Trending News