Festival Offers: దేశంలో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ రూపంలో..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రూపంలో ముందుకొస్తున్నాయి. అటు ఇతర బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆఫర్లతో ఆకర్షించనున్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుండటంతో షాపింగ్ సందడి పెరుగుతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో పాటు షియోమి, రెడ్‌మి వంటి ఉత్పుత్తులు కూడా ఆఫర్లతో వస్తున్నాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్స్, ఇయర్ బడ్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌టీవీ ఇలా అన్ని ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందనున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్స్‌ను సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభించనున్నాయి. 


షియోమి 12 ప్రో స్మార్ట్‌పోన్ అసలు ధర 62,999 రూపాయలు కాగా, ఇప్పుడు 45,499 రూపాయలకు లభిస్తోంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో షియోమి 11 టి ప్రో, షియోమి 11 ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్ లభించనుంది. అదే సమయంలో Redmi K50i, Redmi Note 11 Pro+ 5Gలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. ఇక రెడ్‌మి 10 ప్రైమ్ అయితే అతి తక్కువ ధరకే లభ్యం కానుంది. 


ఇక ట్యాబ్‌లెట్స్ విషయంలో షియోమి ప్యాడ్ 5పై 4 వేల డిస్కౌంట్ లభిస్తోంది. స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ల్యాప్‌ట్యాప్ అసలు ధర 26,999 రూపాయలు కాగా ఇప్పుడు 22,999 రూపాయలకు లభించనుంది. ల్యాప్‌ట్యాప్ విషయంలో RedmiBook 15ను కేలం 28,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీని వాస్తవ ధర 41,999 రూపాయలుంది. ఏకంగా 14 వేల డిస్కౌంట్ లభిస్తోంది. 


ఇక ఇయర్ బడ్స్ విషయంలో రెడ్‌మి Redmi Earbuds 3 Proను కేవలం 1499 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. 1500 డిస్కౌంట్ లభిస్తోంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా Xiaomi Smart TV 5X స్మార్ట్‌టీవీ 43 ఇంచెస్ ధర కేవలం 27,999 రూపాయలు మాత్రమే. 


Also read: Big Billion Days Sale 2022: నైకి, రీబాక్, కిల్లర్, అడిడాస్‌ బ్రాండ్లపై 70 శాతం డిస్కౌంట్‌.. అవును ఇది నిజమే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok