OnePlus Nord CE 3 Lite 5G Price Cut: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో వన్‌పస్ల్‌ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై అదనంగా 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవే కాకుండా అమెజాన్‌ అదనంగా ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ముఖ్యంగా OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అమెజాన్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అమెజాన్‌లో OnePlus Nord CE 3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన ఈ మొబైల్‌ MRP ధర రూ.21,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక డీల్‌లో భాగంగా 9 శాతం తగ్గింపుతో కేవలం రూ.19,999లకే పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు. ఈ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాక్‌ క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.18,499కే లభిస్తుంది. 
 
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. అయితే దీని కోసం ముందుగా మీరు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే OnePlus Nord CE 3 Lite 5G మొబైల్‌పై రూ.18,950 వరకు బోసన్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ. 1,049కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.


వన్‌ప్లస్‌ నార్డో CE 3 లైట్ టాప్‌ 10 ఫీచర్స్‌
1. 6.58 అంగుళాల LCD డిస్‌ప్లే: 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్పష్టమైన, మృదువైన దృశ్యాలను అందిస్తుంది.
2. శక్తివంతమైన Snapdragon 695 ప్రాసెసర్: మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్‌కు సరిపోతుంది.
3. 50MP ప్రధాన కెమెరా: 64MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో కలిసి అద్భుతమైన ఫోటోలు, వీడియోలను అందిస్తుంది.
4. 16MP సెల్ఫీ కెమెరా: AI బ్యూటిఫికేషన్‌తో స్పష్టమైన సెల్ఫీలను అందిస్తుంది.
5. 5000mAh బ్యాటరీ: ఒకేసారి ఛార్జ్‌తో 24 గంటల వరకు నాన్‌స్టాప్‌ లైఫ్.
6. 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్: 30 నిమిషాల్లో 0 నుంచి 50% వరకు ఛార్జ్ చేస్తుంది.
7. 8GB RAM + 256GB స్టోరేజ్: యాప్‌లు, ఫోటోలు, వీడియోలకు పుష్కలంగా స్టోరేజ్‌
8. OxygenOS 13.1: ఆండ్రాయిడ్ 13 ఆధారంగా శక్తివంతమైన UIని అందిస్తుంది.
9. 5G కనెక్టివిటీ: వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్‌ను అందిస్తుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి