Voltas 2023 Model 0.6 Ton 2 Star Split AC Price Drop: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎయిర్ కండిషనర్‌కి ప్రత్యేక డిమాండ్ ఉంది. ఒకపక్క ఎండలు విపరీతంగా పెరగడంతో చాలామంది ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మిడిల్ బడ్జెట్ రేంజిలో లభించే ఎక్కువ ఫీచర్లు కలిగిన వాటినే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఎయిర్ కండిషనర్‌ను ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేశాయి. అంతేకాకుండా గత సంవత్సరం విడుదల చేసిన ఎయిర్ కండిషనర్స్‌కి కూడా ప్రత్యేక డిమాండ్ మార్కెట్‌లో ఉంది. మీరు కూడా ఎప్పటినుంచో మంచి ఏసీ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వేసవికాలం సరైన సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఎయిర్ కండిషనర్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ వోల్టాస్ గత సంవత్సరంలో విడుదల చేసిన 0.6 టన్ ఏసి అతి తక్కువ ధరకే లభిస్తోంది. దీంతోపాటు ఈ ఎయిర్ కండిషనర్ పై అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అయితే దీనిపై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Voltas కంపెనీ విడుదల చేసిన 2023 మోడల్ 0.6 Ton 2 స్టార్ స్పిల్ AC ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అలాగే దీనిపై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ వోల్టాస్ ఈ ఏసీని 2023 సంవత్సరంలో MRP ధర రూ.49,690కు విడుదల చేసింది. అయితే పోను పోను ఈ ఏసీ ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఇది 53% తగ్గింపుతో కేవలం రూ. 22,900కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ మరిన్ని ఆఫర్స్ కూడా అందిస్తోంది..


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇక సమ్మర్ కారణంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఏసీ పై అందిస్తున్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..Voltas 2023 మోడల్ 0.6 Ton 2 స్టార్ స్పిల్ ఏసీని ఇప్పుడే కొనుగోలు చేస్తే దాదాపు అదనంగా రూ.500 తగ్గింపుతో పొందవచ్చు. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే ఐదు శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా సిటీ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేసే వారికి రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు వన్ కార్డు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఈ ఏసీ కేవలం రూ. 20,000లోపే లభిస్తుంది.


దీంతోపాటు ఈ ఏసీపై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి డెట్ చీప్ ధరకే ఏసీ ని పొందవచ్చు. అయితే దీనికోసం ముందుగా మీరు వినియోగిస్తున్న పాత ఏసీని ఫ్లిప్‌కార్ట్‌కు ఎక్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.5,400 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఎయిర్ కండిషనర్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది కండిషన్ బాగుంటేనే ఈ డిస్కౌంట్ మీరు పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ ఈ కొత్త ఏసీని కేవలం రూ. 15 వేల లోపే పొందవచ్చు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి