iPhone 15 Series Launch: అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 15లో 4 మోడల్స్, ఆపిల్ స్మార్ట్‌వాచ్ 9 సిరీస్ విడుదల చేసింది. ఈసారి కొత్తగా టైప్ సి కేబుల్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15  ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు కొత్తగా ఏ17 బయోనిక్ చిప్ ప్రోసెసర్‌పై పనిచేయనున్నాయి. ఆపిల్ వాచ్ అల్ట్రాలో అందించిన ప్రోగ్రామ్ యాక్షన్ బటన్ ఇందులో కన్పిస్తుంది. ఛార్జింగ్ కోసం లైట్నింగ్ పోర్టు కాకుండా..యూఎస్‌బి టైప్ సి పోర్టు ప్రత్యేకత.


ఐఫోన్ 15 ప్రో, ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రత్యేకతలు


ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.1 ఇంచెస్ ఉంటే...ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 ఇంచెస్ సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. బ్రైట్‌నెస్ 2000 నిట్స్ ఉంటుంది. అదనపు రక్షణకై సిరామిక్ షీల్డ్ మెటీరియల్ ఉంటుంది. ఐపీ 68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు మరో ప్రత్యేకత. ఈసారి ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లను గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియంతో రూపొందించారు. దాంతో ఈ ఫోన్ మరింత పటిష్టంగా, తక్కువ బరువు కలిగి ఉంటుంది. మ్యూట్ బటన్ స్థానంలో కొత్తగా యాక్షన్ బటన్ ఉంటుంది. 


ఐఫోన్ 15 ప్రో కెమేరా ఫీచర్లు


ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా కలిగి ఉంటుంది. లెన్స్ గ్లేర్ తగ్గించేందుకు ప్రత్యేక కోటింగ్ ఉంటుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 12 మెగాపిక్సెల్ 3 ఎక్స్ టెలీఫోన్ కెమేరా ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో మాత్రం 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమేరా ఉపయోగించారు. ఇది 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ కెమేరా ఇచ్చారు


ఐఫోన్ 15 ప్రో సిరీస్ ధరలు ఇలా


ఐఫోన్ 15 ప్రో సిరీస్ ధరలు ఇండియాలో 1,34 వేల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో 128 జీబీ స్టోరేజ్ మోడల్ అయితే 1,34,900 రూపాయలు కాగ 256 జీబీ స్టోరేజ్ అయితే 1,44,900 రూపాయలుంది. ఇక 512 జీబీ స్టోరేజ్ అయితే 1,64,900 రూపాయలు కాగా 1 టీబీ వేరియంట్ అయితే 1,84,900గా ఉంది. ఇక ఐఫోన్ ప్రో మ్యాక్స్ వేరియంట్‌లో 256 జీబీ వేరియంట్ ధర 1,59,900 రూపాయలు. ఇందులో 512 జీబీ వేరియంట్ ధర 1,79,900 రూపాయలు కాగా 1 టీబీ వేరియంట్ అయితే 1,99,900 రూపాయలుంది. 


ఐఫోన్ 15 ప్రో సిరీస్ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 22 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఈ సిరీస్‌లో బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్ 2 లక్షల రూపాయలు కావడంతో మార్కెట్‌లో అత్యంత ఖరీదైంది ఇప్పుడు ఇదే.


Also read: Toyota 7 Seater: టొయోటా నుంచి కొత్తగా రెండు 7 సీటర్ ఎస్‌యూవీలు, ఫీచర్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook