Toyota 7 Seater: టొయోటా నుంచి కొత్తగా రెండు 7 సీటర్ ఎస్‌యూవీలు, ఫీచర్లు ఇవే

Toyota 7 Seater: దేశంలోని కార్ మార్కెట్‌లో టొయోటా స్థానం ప్రత్యేకం. సెడాన్ అయినా 7 సీటర్ అయినా టొయోటా బ్రాండ్ కార్లకు క్రేజ్ ఎక్కువేనని చెప్పాలి. ముఖ్యంగా 7 సీటర్ అంటే ముందుగా గుర్తొచ్చేది టొయోటానే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2023, 08:25 AM IST
Toyota 7 Seater: టొయోటా నుంచి కొత్తగా రెండు 7 సీటర్ ఎస్‌యూవీలు, ఫీచర్లు ఇవే

Toyota 7 Seater: కార్లలో స్ట్రాంగ్ కార్లుగా టొయోటా వాహనాలకు పేరుంది. ముఖ్యంగా 7 సీటర్ కార్లలో టొయోటా కార్లకు ప్రత్యేక స్థానం. ఇప్పుడు ఇండియాలో ఇదే టొయోటా కంపెనీ మరో రెండు అద్భుతమైన 7 సీటర్ ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది. ఆ వివరాలు మీ కోసం..

టొయోటా కిర్లోస్కార్ మోటార్స్ కొత్తగా రెండు 7 సీటర్ ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేయనుంది. ఇది తొలి కోరోలా క్రాన్స్ ఆధారిత ఎస్‌యూవీ. ఇవి హ్యుండయ్ ట్యూసాన్, జీప్ మెరిడియన్ వంటి ఎస్‌యూవీలతో పోటీ పడనున్నాయి. నెక్స్ జెన్ ఫార్చ్యూనర్ అసలైన గేమ్ ఛేంజర్. టొయోటా ఈ ఎస్‌యూవీలో చాలా మార్పులు చేయనుంది. కొత్త ఫార్చ్యూనర్ మార్కెట్‌లో కొత్త ప్లాట్‌ఫామ్, ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికత, మైల్డ్ హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌తో పాటు 7 సీటర్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త మైలురాయి కావచ్చు. 

TOYOTA COROLLA CROSS SUV

టొయోటా ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో కొరోలా క్రాన్స్ ఆధారిత ఎస్‌యూవీ లాంచ్ చేసేందుకు యోచిస్తోంది. ఈ మోడల్ టొయోటా అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపీవీ టొయోటా ఇన్నోవా హైక్రాస్‌తో వస్తోంది. ఈ కొత్త కారు వీల్ బేస్ 2,640 మిల్లీమీటరక్లు కాగా ఇందులో కేబిన్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. హైక్రాస్‌కు ఉన్నట్టే ఇందులో కూడా ఫ్లాట్‌ఫోల్డ్ మూడు వరుసల సిట్టింగ్ ఉంటుంది. ఇందులో డిజైన్ చాలా ప్రత్యేకం. ఇన్నోవా హైక్రాస్ కంటే వేరుగా ఉంటుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రేన్ ఆప్షన్లు ఉన్నాయి.

NEW TOYOTA FORTUNER

అప్‌కమింగ్ జనరేషన్‌కు సంబంధించి టొయోటా ఫార్చ్యూనర్ 2024లో ఇండియాలో లాంచ్ కావచ్చు. కొత్త టొయోటా టాకోమా పికప్ ట్రక్ డిజైన్ ఆధారంగా ఈ ఎస్‌యీవీ టీఎన్జీఏ‌ఎఫ్ ఆర్కిటెక్చర్‌తో నిర్మితమైంది. 2024 ఫార్చ్యూనర్ అడ్వాన్స్డ్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇందులో ఏడీఏఎస్ కూడా ఉంటుంది. కొత్త పార్చ్యూనర్‌లో సన్‌రూఫ్ ఉండటం మరో ప్రత్యేకత. ఈ వాహనం స్టెబిలిటీ కంట్రోల్, హైడ్రోలిక్ స్టీరింగ్ వీల్‌తో రానుంది. 

Also read: Top Selling SUV: మార్కెట్‌లో అన్ని ఎస్‌యూవీలను వెనక్కి నెట్టేసిన టాటా పంచ్, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News