Google Pixel 8A Price Drop: ప్రస్తుతం చాలా మంది గూగుల్‌ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇవి అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదల కావడంతో యువత ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో ఇటీవలే విడుదలైన గూగుల్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. రిలయన్స్‌ డిజిటల్‌లో గూగుల్‌ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Google Pixel 8a స్మార్ట్‌ఫోన్‌ డెడ్ చీప్‌ ధరకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Google Pixel 8a మొబైల్‌పై రిలయన్స్‌ డిజిటల్‌లో ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. మార్కెట్‌లో దీని MRP ధర రూ.49,999 కాగా ప్రత్యేకమై డిస్కౌంట్‌ ఆఫర్స్‌లో భాగంగా 34 శాతం వరకు డిస్కౌంట్‌తో రూ.34,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి అదనంగా రిలయన్స్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌ లభించనుంది.


ఇక ఈ మొబైల్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు IDFC బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు 7.5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా OneCard క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి దీనిని కొనుగోలు చేసిన దాదాపు రూ.1000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అధిక డిస్కౌంట్‌ పొందాలనుకునేవారు J&K బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే ఏకంగా రూ.2,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.32,499కే పొందవచ్చు.


ఇక ఈ మొబైల్స్‌పై రిలయన్స్‌ డిజిటల్‌ ప్రత్యేకమైన ప్రొటెక్షన్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ దీనిని పొందడానికి కేవలం రూ. 4 వేల చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీతో విడుదలైంది. అంతేకాకుండా 6.1 అంగుళాల డిస్ల్పేతో పాటు 1080 x 2400 రిజల్యూషన్ స్క్రీన్‌తో లాంచ్‌ అయ్యింది. దీంతో పాటు 4404 mAh, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. 


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.