Jio vs Airtel Plans: ఎయిర్‌టెల్, జియోల నుంచి 296 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్, ఏది బెస్ట్
Jio vs Airtel Plans: జియో వర్సెస్ ఎయిర్‌టెల్ రెండూ ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. రెండు ప్లాన్స్ ధర ఒకటే. ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి. ఏ ప్లాన్ ప్రయోజనాలు ఎలా ఉన్నాయి. ఏది మంచిదో తెలుసుకుందాం..
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీలు. రెండు కంపెనీలు తక్కువ ధరకు అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రవేశపెట్టాయి. తక్కువ ధరలో ఎక్కువ డేటా అందిస్తున్నాయి ఈ ప్లాన్స్. రెండు ప్లాన్స్ మార్కెట్‌లో ఇప్పుడు పోటీ పడుతున్నాయి. జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రయోజనాల గురించి ఓ సారి చెక్ చేద్దాం..
జియో, ఎయిర్‌టెల్ రెండింట్లోనూ 296 రూపాయలకే ప్రీ పెయిడ్‌ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో కాలింగ్, డేటా, ఇతర ప్రయోజనాలున్నాయి. ఈ రెండు ప్లాన్స్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉన్నాయి. రెండింట్లోనూ సమానమైన సౌకర్యాలున్నాయి. కానీ ప్రయోజనాలు కొద్దిగా వేర్వేరుగా ఉన్నాయి. ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే..ఏది బెస్ట్ ప్లాన్ అనేది అర్ధమౌతుంది.
Reliance Jio 296 Prepaid Plan
జియో 296 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఇందులో యూజర్లకు 25 జీబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో 5జి ఆఫర్‌తో వస్తోంది. అంటే యూజర్లు ఈ ప్లాన్‌తో పాటు 5జిని ఎంజాయ్ చేయవచ్చు. ఇతర ప్రయోజనాల గురించి విశ్లేషించుకుంటే..జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి.
Airtel 296 Prepaid Plan
ఎయిర్‌టెల్ 296 రూపాయల ప్లాన్‌లో 25 జీబి డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది 30 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇక ప్రయోజనాలైతే..ఈ ప్లాన్‌లో పోలో 24 గంటల సేవలు, ఫాస్టాగ్‌పై 100 రూపాయలు క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్, వింక్ మ్యూజిక్ సభ్యుత్వం లభిస్తాయి.
రెండు ప్లాన్స్‌లో సౌకర్యాలు సమానంగా ఉన్నాయి. అంటే 25 జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి. జియోలో జియా సినిమా, జియో క్లౌడ్, జియో టీవీ ఉచితంగా లభిస్తే..ఎయిర్‌టెల్‌లో వింక్ మ్యూజిక్, హెలో ట్యూన్, ఫాస్టాగ్ 100 రూపాయలు క్యాష్‌బ్యాక్ ఉన్నాయి.
Also read: ITR 2023-24: ట్యాక్స్ బెనిఫిట్స్ ప్రయోజనాలు కలిగే 7 ముఖ్యమైన అలవెన్సులు ఇవే, చాలామందికి తెలియదు కూడా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook