JioPhone 5G: జియో త్వరలోనే అత్యంత చవకైన 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. జియో 5జి స్మార్ట్‌ఫోన్ ధర ఎంత, ఫీచర్లు ఎలా ఉంటాయనే విషయంలో స్పష్టత వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ తరువాత ఇప్పుడు జియో 5జి స్మార్ట్‌పోన్ లాంచ్ చేయనుంది. ఇది కూడా అత్యంత చవకైన 5జి స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుంది. మీరు కూడా మంచి ఫీచర్లు కలిగిన 5జి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర ఎలా ఉందో పరిశీలిద్దాం..


జియో ఫోన్ నెక్స్ట్ గత ఏడాది నవంబర్ నెలలో 6,499 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు 5జి స్మార్ట్‌ఫోన్‌ను జియో 10 వేల కంటే తక్కువకే అందించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే కచ్చితమైన ధర ఎంతనే విషయంలో జియో నుంచి ఏ విధమైన అధికారిక ప్రకటన విడుదల కాలేదు. 


జియోఫోన్ 5జి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు


జియోఫోన్ 5జి స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడి స్క్రీన్‌తో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 480 5జి చిప్‌సెట్‌తో అనుసంధానితమై ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమేరాతో పాటు రేర్ డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. జియో 5జి స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌తో రావచ్చు.


స్మార్ట్‌ఫోన్ ప్రగతి ఓఎస ఆధారంగా పనిచేస్తుందని తెలుస్తోంది. గూగుల్ ప్లే సేవలతో పాటు అందుబాటులో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆల్వేస్ ఆన్ గూగుల్ అసిస్టెంట్, రీడ్ ఆలౌడ్ టెక్స్ట్, గూగుల్ సపోర్టెడ్ ట్రాన్స్‌లేషన్ వంటి అదనపు ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. జియో 5 జి స్మార్ట్‌ఫోన్ జియో ఏజీఎం భేటీలో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. 


Also read: LPG Cylinder Price: గ్యాస్ సిలెండర్ ధర కేవలం 750 రూపాయలే, వెంటనే బుక్ చేసి లబ్ది పొందండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook