Moto G64 5G: మోటరోలా నుంచి దిమ్మతిరిగే ఫీచర్స్‌తో మరో 2 కొత్త మొబైల్స్.. ఫీచర్స్ లీక్!
Moto G64 5G: త్వరలోనే మోటరోలా (Motorola) బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Moto G64 5G: భారత మార్కెట్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మోటరోలా (Motorola) బ్రాండ్ మొబైల్స్‌కి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రీమియం బిల్ట్ క్వాలిటీతో మార్కెట్‌లోకి అందుబాటులో రావడం వల్ల చాలా మంది యువత వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే కంపెనీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ చేసిన Motorola Edge 50 Pro మొబైల్‌కి ప్రత్యేకమై డిమాండ్ లభించింది. ఇప్పుడు త్వరలోనే మార్కెట్‌లోకి కంపెనీ ఎడ్జ్ సిరీస్‌కి కొత్త పేరు చేరబోతున్నట్లు తెలిపింది. ఈ మొబైల్ Motorola Edge 50 Ultra పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు త్వరలోనే మార్కెట్‌లోకి ఎంతో సూపర్‌హిట్ అయిన G సిరీస్ కూడా లాంచ్ కాబోతోంది. ఇది కూడా Motorola G64 5G పేరుతో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు కొంతమంది టిప్‌స్టర్స్ తెలిపారు. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి.
మోటో జీ64:
ప్రముఖ టెక్ కంపెనీ మోటో ఈ Motorola G64 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది. ఇటీవలే లాంచ్ అయిన Geekbench జాబితా ప్రకారం, సింగిల్-కోర్ పరీక్షలో 1026 పాయింట్లు సాధించిందని సమాచారం. ఇక ఈ మొబైల్ మల్టీ-కోర్ పరీక్షలో 2458 పాయింట్లను పొందిందని తెలుస్తోంది. దీనిని కంపెనీ 12GB ర్యామ్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది MediaTek Dimension 7025 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ PowerVR BXM-8-256 GPUతో మార్కెట్‌లో రాబోతున్నట్లు సమాచారం.
టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ తెలిపిన వివరాల ప్రకారం..ఈ Motorola G64 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు (ఫోన్ బ్లూ, గ్రీన్ కలర్) కలర్స్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ డిస్‌ప్లే సెంటర్ పంచ్-హోల్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక దీని కెమెరా వివరాల్లోకి వెళితే, ఇది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇందలో భాగంగా ఈ మొబైల్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
Motorola Edge 50 Ultra:
ఇక Motorola Edge 50 Ultra స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, ఇటీవలే Geekbench పరీక్షలో సింగిల్-కోర్ పరీక్షలో 1947 పాయింట్లు సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ-కోర్ పరీక్షలో 5149 పాయింట్లను పొందిన్నట్లు సమాచారం. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయిన వివరాల ప్రకారం.. ఇది Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్ కూడా 12 GB ర్యామ్‌తో రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి