Nothing Ear 2 Black: నథింగ్ ఇయర్ 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
Nothing Ear 2 Black: ప్రముఖ టెక్ కంపెనీ నథింగ్ బ్లాక్ కలర్ వేరియం ఇయర్ బడ్స్ ను విడుదల చేసింది. ఇది ఇంతకు ముందు విడుదల చేసిన వైట్ వేరియంట్ కంటే కొత్తగా కనిపిస్తోంది. ఇక ఈ బడ్స్ కు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Ear 2 Black: నథింగ్ ఫోన్ కస్టమర్స్ కి కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. అందరూ ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న నథింగ్ ఇయర్ బడ్స్ ను గురువారం కంపెనీ విడుదల చేసింది. కొత్త బ్లాక్ వేరియంట్‌తో ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇయర్ బడ్స్ 2 హై-రెస్ ఆడియో సర్టిఫైడ్ తో పాటు నాయిస్ క్యాన్సిలేషన్ వంటి చాలా రకాల కొత్త ఫీచర్లతో నథింగ్ వినియోగదారులకు లభిస్తోంది. ఇంతకుముందు కంపెనీ ఇయర్ 2ని వైట్ కలర్ వేరియంట్‌లో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ధర విషయానికొస్తే ఇంతకుముందు విడుదల చేసిన వైట్ కలర్ వేరియంటకు సమానంగా ఉంది.
నథింగ్ ఇయర్ 2 బ్లాక్ ధర:
నథింగ్ ఇయర్ 2 బ్లాక్ రూ. 9,999తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా జూలై 21వ తేదీన కంపెనీ ఈ బడ్స్ ను ఈ కామర్స్ వెబ్సైట్ అయిన ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబోతున్నట్లు తెలిపింది. త్వరలోనే విడుదల చేయబోయే నథింగ్ స్మార్ట్ ఫోన్ 2కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ కూడా జూలై 11 నుంచి జూలై 20 వరకు అందుబాటులో ఉంచబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
Also Read: Tamim Iqbal Retirement: తమీమ్ ఇక్బాల్ షాకింగ్ నిర్ణయం.. మూడు ఫార్మాట్లకు గుడ్‌బై
నథింగ్ ఇయర్ 2 బ్లాక్ స్పెషాలిటీ..
ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన నథింగ్ ఇయర్ 2 హార్డ్‌వేర్ పరంగా చూసుకుంటే.. వైట్ వేరియంట్ కంటే ఈ వేరియంట్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వైట్ వేరియంట్ లో ఉన్న అన్ని రకాల ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌బడ్స్‌లో మెరుగైన గ్రిప్ కోసం నల్లటి షీట్ కూడా అందుబాటులో ఉంది. ఇయర్ బడ్ 11.6mm కస్టమ్ డ్రైవర్‌ను కలిగి ఉంటుంది. దీని ద్వారా మీరు మంచి బాస్, క్రిస్టల్-క్లియర్ హైస్‌ను పొందుతారు.
ఫీచర్స్:
✾ ఇయర్ బడ్ 11.6mm కస్టమ్ డ్రైవర్
✾ IP54 బడ్స్ వాటర్ రెసిస్టెంట్
✾ Google ఫాస్ట్ పెయిర్
✾ మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్
✾ డ్యుయల్ కనెక్షన్.
✾ వాయిస్ క్లియర్ టెక్నాలజీ
✾ LED ఛార్జింగ్ వ్యూ
Also Read: New Releases This Weekend on OTT: ఓటిటిలో ఈ వారం కొత్త సినిమాలు.. నాన్-స్టాప్ ఫన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి