Oneplus Nord Ce 4 5G Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ శుభవార్త తెలిపింది. OnePlus తమ కొత్త  5G మొబైల్‌ను ఏప్రిల్ 1న భారతదేశంలో లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. కంపెనీ OnePlus Nord CE 4 మోడల్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ కూడా అమెజాన్‌ అధికారిక మైక్రోసైట్‌లో ప్రత్యేక్ష ప్రసారం జరుగుతుంది. అంతేకాకుండా దీని సంబంధించిన ఫీచర్స్‌ను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా కంపెనీ దీనిని మొదటగా 8GB ర్యామ్‌, 256GB ర్యామ్‌ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లాంచ్‌ చేయబోతోంది. దీంతో పాటు అనేక రకాల ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అందుబాటులో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, వన్‌ప్లస్‌ దీనిని  CPH2613 మోడల్ నంబర్‌తో లాంచ్‌ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ మొబైల్‌ సింగిల్-కోర్ టెస్టింగ్‌లో 1,135 పాయింట్లు సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌ ప్రాసెసర్‌ విషయానికొస్తే ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌ను కంపెనీ ఏప్రిల్ 1 న సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన వెంటేనే అమోజాన్‌లోకి లభించనుంది. 


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కేవలం 15 నిమిషాల పాటు చార్జ్‌ చేస్తే దాదాపు రోజుంతా బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మొబైల్‌ స్టోరేజ్‌ విషయానికొస్తే, 8GBర్యామ్‌, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ స్టోరేజ్‌ను  1TB వరకు విస్తరించుకోవడానికి ప్రత్యేక చిప్‌సిస్టమ్‌ను కూడా అందిస్తోంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ఇతర ఫీచర్స్:


6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే: 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్‌, స్పష్టమైన దృశ్యాలను అందిస్తుంది.
Qualcomm Snapdragon 695 ప్రాసెసర్ శక్తివంతమైన పనితీరును అందిస్తుంది.
6GB RAM + 128GB స్టోరేజ్: యాప్‌, గేమ్‌ల కోసం పుష్కలమైన ఇంటర్నల్ స్టోరేజ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
అద్భుతమైన ఫోటోలు, వీడియోల కోసం 50MP ట్రిపుల్ రియర్ కెమెరా.
16MP సెల్ఫీ కెమెరా: స్పష్టమైన సెల్ఫీలను తీస్తుంది.
రోజంతా ఉండే బ్యాటరీ లైఫ్‌ను అందించేందుకు 4500mAh బ్యాటరీ
త్వరగా ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌.
ఆక్సిజన్OS 12.1: Android 12 ఆధారంగా ఒక స్మూత్, కస్టమైజ్ చేయగల యూజర్ ఇంటర్‌ఫేస్.
వేగవంతమైన డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి 5G కనెక్టివిటీ.
ఒక చేతితో ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉండే స్లిమ్, స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి