COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy S24 Price: ప్రముఖ దక్షిణ కొరియా టెక్ బ్రాండ్ సాంసంగ్ మరో ప్రీమియం స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.  ఈ మొబైల్ ను Samsung Galaxy S24 మోడల్ తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఈ మొబైల్ ను జనవరి 17న ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు సాంసంగ్ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన ప్రీ బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించింది. కొత్త గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా అనే మూడు మోడల్స్ విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది అయితే వీటికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఈరోజు విడుదల కాబోయే స్మార్ట్ ఫోన్స్ గొప్ప సాంకేతిక పరిజ్ఞానంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. Galaxy S24 సిరీస్‌ విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్స్ లో అనేక రకాల కొత్త AI ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీంతోపాటు AI ఇంటిగ్రేషన్ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఈ మొబైల్ ను గ్లోబల్ లాంచింగ్ చేసిన తర్వాత భారత దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో లభించే అవకాశాలు ఉన్నట్లు ప్రముఖ టిప్స్.... తెలిపారు. ఈ Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్ 108MP ప్రధాన కెమెరాతో పాటు 40MP సెల్ఫీ కెమెరాలతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ మొబైల్ పై ఐరోపా ఆస్ట్రేలియా వంటి దేశాలలో Samsung రూ. 30,000 వరకు డిస్కౌంట్ ప్రకటించినట్లు సమాచారం. 


ఆస్ట్రియాలో గెలాక్సీ S24 సిరీస్ ప్రీ-బుకింగ్‌పై చేసుకున్న కస్టమర్స్‌కి సాంసంగ్ అనేక రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. ముఖ్యంగా బుకింగ్ చేసుకునే వారికి..128GB వేరియంట్‌ను బుక్ చేస్తే, 256GB మోడల్ డెలివరీ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక 256GB వేరియంట్‌ను బుక్ చేస్తే, 512GB మోడల్ డెలివరీ చేస్తోందట. ఇవే కాకుండా ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే వారికి అనేక రకాల అందిస్తోందని సమాచారం.


స్టోరేజ్ బంప్ ఆఫర్ ఆఫర్లో భాగంగా Samsung Galaxy S24 Ultra మొబైల్‌ను కొనుగోలు చేస్తే మంచి బెనిఫిట్స్ లభించనున్నాయి. 512GB వేరియంట్‌ను ఆర్డర్ చేసుకునే వారికి 1TB మోడల్‌ను డెలివరని చేయబోతున్నట్లు ప్రకటించింది. కాకుండా ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ద్వారా దాదాపు రూ.9,000 వరకు తగ్గింపు లభిస్తుంది.


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter