Vivo V27 Series: వివో నుంచి క్యూట్ స్మార్ట్‌ఫోన్.. డిజైన్, ఫీచర్లు కూడా అదుర్స్! కొనకుండా అస్సలు ఉండలేరు
Vivo to Release Vivo V27 Series 5G Smartphone Soon. చైనా మొబైల్ సంస్థ వివో తన బ్యాంగ్-అప్ సిరీస్ `Vivo V27` త్వరలోనే ప్రారంభించబోతోంది.
Vivo to Release Vivo V27 Series 5G Smartphone Soon: భారత మార్కెట్‌లో చైనా మొబైల్ సంస్థ 'వివో'కు చాలా క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్స్ తీసుకొస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంతోంది. ఈ క్రమంలోనే అద్భుత ఫీచర్లతో ఇటీవలే 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో తన బ్యాంగ్-అప్ సిరీస్ 'Vivo V27' త్వరలోనే ప్రారంభించబోతోంది. ఈ సిరీస్‌కి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో లీకైంది. అతి త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లను పలు నివేదికలు వెల్లడించాయి.
Vivo V27 Series Look:
పలు నివేదికల ప్రకారం... వివో వీ27 (Vivo V27) సిరీస్ దాదాపుగా వివో ఎస్16 (Vivo S16) సిరీస్ లాగా ఉంటుంది. వివో వీ27 సిరీస్ డిజైన్, ఫీచర్లు అచ్చు వివో ఎస్16 సిరీస్ మాదిరిగానే ఉంటాయట. వివో ఎస్16 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. వివో వీ27 సిరీస్ లీకైన చిత్రాన్ని చూస్తుంటే.. డిజైన్ సరిగ్గా ఎస్16 లానే ఉందట.
Vivo V27 Series Design:
Vivo V27 సిరీస్ ఫోన్ పెద్ద దీర్ఘచతురస్రాకార కెమెరాను కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనిలో LED ఫ్లాష్ కూడా ఉంది. ఈ ఫోన్ రెండు రంగులలో ఉంది. ఆకుపచ్చ మరియు బంగారు రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
Vivo V27 Series Camera:
వివో వీ27 సిరీస్ OIS మరియు EISలను కలిగి ఉంటుంది. ఇది 50MP సోనీ IMX766 ప్రధాన కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ మందం 7.4MM మాత్రమే ఉంటుందట. ఈ ఫోన్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. ఈ ఫోన్ 12GB వరకు RAM ఉండనుంది. అదే సమయంలో స్టోరేజ్ 256GB వరకు అందుబాటులో ఉంటుంది.
Vivo V27 Series Processor:
వివో వీ27 Proని MediaTek Dimensity 8200, Vivo V27 MediaTek Dimensity 7200 ద్వారా రానుంది. లాంచ్ అయిన తర్వాతే ఈ ఫోన్ మరిన్ని వివరాలు తెలియరానున్నాయి. ఏదేమైనా ఈ క్యూట్ స్మార్ట్‌ఫోన్ అని టాక్.
Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఐఫోన్.. ఈ సువర్ణావకాశం మళ్లీమళ్లీ రాదు! కొనడానికి ఎగబడుతున్న జనం
Also Read: డబ్ల్యూపీఎల్ వేలంలో మంధానకు భారీ ధర.. ఈలలు, కేకలు వేసిన భారత అమ్మాయిలు! వీడియో చూడాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.