వాట్సప్. ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా కన్పించే యాప్. బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులతో మాట్లాడేందుకు , చాట్ చేసేందుకు, ఆఫీసు, వ్యాపార వ్యవహారాలు షేర్ చేసుకునేందుకు వాట్సప్ వినియోగించినట్టుగా మరేదీ ఉపయోగించరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాట్సప్‌లో భద్రత ఎక్కువనే కారణంతో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా మీరు, పంపించిన వ్యక్తి తప్ప మరెవరూ చూడలేరు. వాట్సప్ దేనినీ స్టోర్ చేయదు. అందుకే ప్రతి ఒక్కరూ వాట్సప్ చాటింగ్‌పై సురక్షితంగా ఉంటారు. అయితే వాస్తవం మరోలా ఉంది. 


వాట్సప్ అంత సురక్షితం కాదనే తెలుస్తోంది. వాట్సప్ కూడా ఇతర వేదికల్లానే మీ సమాచారాన్ని స్టోర్ చేస్తుందట. వాట్సప్ కంపెనీ చెప్పిందానికి, వాస్తవానికి చాలా తేడా ఉందని తెలుస్తోంది. వాట్సప్ తన యూజర్ల డేటాను ఏదైనా ఫిర్యాదుకు సమాధానంగా లేదా ఎవరైనా యూజర్..సంస్ధ పాలసీని ఉల్లంఘించినప్పుడు బ్లాక్ చేసేందుకు ఉపయోగించుకుంటుంది ఆ డేటాను.


వాట్సప్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేస్తుంటుంది. ఉదాహరణకు ఏయే గ్రూపుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు, సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్లు, ప్రతి యాక్టివిటీ, ప్రొఫైల్ పిక్చర్, మీరు బ్లాక్ చేసిన యూజర్లు, మీ డివైస్ ఐపీ ఐడీ వంటి వివరాల్ని భద్రం చేస్తుంది. అయితే వాట్సప్ మెస్సేజీలు మాత్రం స్టోర్ కావనేది ఉపశమనం కల్గించే అశంగా ఉంది. 


వాట్సప్ ఈ మొత్తం సమాచారాన్ని వాట్సప్ రిక్వెస్ట్ ఇన్‌ఫర్మేషన్ కింద స్టోర్ చేస్తుంది. సంబంధిత సమాచారాన్ని కేవలం పోలీసులకు మాత్రమే వాట్సప్ అందిస్తుంది. సంబంధిత వ్యక్తికి వ్యతిరేకంగా ఏదైనా కేసు ఉన్నప్పుడు, పోలీసులు ఆ సమాచారాన్ని కోరినప్పుడు మాత్రమే ఆ డేటాను అందిస్తుంది. అయితే మెస్సేజీల విషయంలో కంపెనీ పాలసీ సుస్పష్టం. వాట్సప్ ఎప్పుడూ ఆ మెస్సేజీలను స్టోర్ చేయదు. ఎవరికీ షేర్ చేయదు.


Also read: Share Market: ఈ రంగాల్లో పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే అవకాశం, మార్కెట్ నిపుణుల సూచన ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook