44 staff members test positive for Covid-19 in Hyderabad Gandhi Hospital : తెలంగాణలో (Telangana) రోజురోజుకు కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య పౌరులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. కరోనా (Corona) కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ (Telangana Government) ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ కేసలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. తాజాగా పలు ఆస్పత్రుల సిబ్బంది, (Hospital staff) డాక్టర్లు కూడా కోవిడ్ (Covid) బారినపడుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో (Hyderabad Gandhi Hospital) 44 మంది సిబ్బందికి (44 staff) కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్‌ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్స్, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. వీరందరూ ఐసోలేషన్‌లో (Isolation‌) ఉన్నారు. వీరికి చికిత్స కొనసాగుతోందని గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) అధికారులు తెలిపారు. 


ఇక తెలంగాణలో కోవిడ్ కేసులు (Covid cases in Telangana) పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో (government hospitals) అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే అత్యవసరం కాని శస్త్ర చికిత్సలు నిలిపి వేశారు. తెలంగాణలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతుండడంతో త్వరలోనే గాంధీలో జీనోమ్​ సీక్వెన్సింగ్ (Genome sequencing) ఏర్పాటు చేయనున్నారు.


Also Read : PL New Sponsor: ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ గా టాటా గ్రూప్.. తప్పుకున్న వివో!


ఇక తెలంగాణలో (Telangana) గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల (corona cases) సంఖ్య 6,95,855. తెలంగాణలో కోవిడ్‌ వల్ల చనిపోయిన వారి సంఖ్య తాజాగా 4,043కి చేరింది. రాష్ట్రంలో 14,995 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో (Telangana) ఆంక్షలను పొడిగిస్తూ టీఎస్ సర్కార్‌‌ (TS Sarkar‌) ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు కరోనా (corona) ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.


Also Read : SA vs IND: టీమిండియా క్రికెటర్ కు కరోనా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook