Corona Business: నాకు కరోనా లేదు..రండి.. కొనండి..
కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో అన్నిరకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు జనం భయపడే పరిస్థితి. అందుకే ఓ వ్యక్తి వినూత్న తరహాలో వ్యాపారం చేస్తున్నాడు.
కరోనా వైరస్ సంక్రమణ ( Corona virus spread ) నేపధ్యంలో అన్నిరకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు జనం భయపడే పరిస్థితి. అందుకే ఓ వ్యక్తి వినూత్న తరహాలో వ్యాపారం చేస్తున్నాడు.
తెలంగాణ ( Telangana ) లో రోజురోజుకూ కరోనా వైరస్ ( Corona virus ) విజృంభిస్తోంది. తిరిగేవారు తిరుగుతున్నా..నిత్యావసర వస్తువులు గానీ, కూరగాయలు గానీ కొనడానికి జనం ఇంకా భయపడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా ఇప్పటికే వ్యాపారాలు చాలావరకూ దెబ్బతిన్నాయి. అందుకే జనాన్ని ఆకర్షించడానికి ఓ కూరగాయల వ్యాపారి వినూత్న పద్థతిని ఎంచుకున్నాడు. కోవిడ్ టెస్ట్ ( Covid test ) చేయించుకుని..నెగెటివ్ గా వచ్చిన రిపోర్ట్ ను పెద్దది చేసి బోర్డుగా వేలాడదీశాడు. అంతేకాదు...తనకు కరోనా లేదని..నిర్భయంగా తనవద్దకు వచ్చి కూరగాయలు కొనుగోలు చేయవచ్చని ప్రచారం చేస్తున్నాడు. అదిలాబాద్ జిల్లా ( Adilabad district ) ఉట్నూరు ( Utnuru ) కు చెందిన డోలి శంకర్ అనే కూరగాయల వ్యాపారి చేస్తున్న ప్రయత్నమిది. అందర్నీ ఆకర్షిస్తోంది.
కూటికోసం కోటి విద్యలనేవి తప్పదంటారు. అందుకే ఈ వ్యాపారి ఇలా చేస్తున్నాడు. ఎవరిదగ్గర కొనుగోలు చేస్తే ఏమౌతుందననే భయం ప్రజల్లో నెలకొన్న నేపధ్యంలో ఈ వ్యాపారి బోర్డు చూసి జనం వస్తున్నారు కూడా. అందుకే ఉట్నూరు కూరగాయల దుకాణాల్లో ఈ వ్యాపారికి ఈ మధ్య డిమాండ్ పెరిగింది. Also read: Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి