Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని పట్టణాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో మంగళవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 

Last Updated : Aug 26, 2020, 10:09 AM IST
Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

Telangana Corona updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని పట్టణాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో మంగళవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24గంటల్లో మంగళవారం (ఆగస్టు 25) తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 3,018 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 10 మంది మరణించినట్లు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి పెరగగా.. కరోనా మరణాల సంఖ్య 780కు చేరింది. Also read: Building Collapsed: 15కు చేరిన మృతులు.. కొనసాగుతున్న రెస్క్యూ

ప్రస్తుతం తెలంగాణలో 25,685 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి 85,223 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. తెలంగాణలో నిన్న 61040 టెస్టులు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 10,82,094కి నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. జీహెచ్ఎంసీలో నిన్న అత్యధికంగా 475 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు.. ఇలా ఉన్నాయి..

telangana corona cases bulletin

Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల

Trending News