Actor Nani requests to corona patients: దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) బారిన పడి నిత్యం వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కరోనా బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేస్తే కొంతమందినైనా రక్షించుకోగలం.. కాపాడుకోగలం.. ఈ నేప‌థ్యంలో ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేయాలని హైదరాబాద్ సైబ‌రాబాద్ పోలీసులు ( Cyberabad police ) ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్ అనే వింగ్‌ను ఏర్పాటుచేసి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. Also read: Covid-19: దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు



ఈ క్రమంలో సైబ‌రాబాద్ పోలీసుల ఆధ్వ‌ర్యంలో ప్లాస్మా దానం చేసిన వ్య‌క్తుల‌ను ఇప్ప‌టికే టాలీవుడ్ న‌టుడు విజ‌య్‌ దేవ‌రకొండ ( Vijay Deverakonda) స‌న్మానించి అభినందించారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్లాస్మా దానం చేయాల‌ని టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ( Nani ) విజ్ఞ‌ప్తి చేశారు. కొన్ని లక్ష‌ల మందికి కోవిడ్-19 సోకింది. కొన్ని ల‌క్ష‌ల మందికి ఇప్పటికే నయమైంది. అయితే.. కరోనా నయమైన వారి ద‌గ్గ‌ర ఒక మంచి అవ‌కాశముంది. మీరు దానం చేసే ప్లాస్మా వ‌ల్ల‌ ఇద్ద‌రి జీవితాన్ని కాపాడ‌వ‌చ్చు.. ప్లీజ్ అంటూ నాని వీడియో సందేశాన్ని ట్వీట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోను సైబరాబాద్ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. స్వయంగా హీరో నాని దానిని షేర్ చేసి ప్లాస్మాను డొనేట్ చేయండి.. ప్రాణాలను కాపాడండి అంటూ ట్విట్ చేశారు. ఇదిలాఉంటే.. సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కృషిని ప్రతీఒక్కరూ ప్రశంసిస్తున్నారు. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?