లంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశంసల వర్షం కురిపించాడు. సీఎం కేసీఆర్‌ను చాలా బలమైన నేత అని అన్నాడు ఓవైసి. దక్షిణ భారతదేశంలోనే అత్యద్భుతమైన భవిష్యత్తు ఉన్న నాయకుడని పేర్కొన్నాడు. జీహెచ్ఎంసి ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ కేసీఆర్ మంచి పరిపాలన సాగిస్తున్నారు అని ప్రశంసించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  Telugu Memes: గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ పోలింగ్, నెటిజెన్ల ట్రోలింగ్


ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) తను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అని.. మంచి పాలన సాగిస్తున్నారు అని తెలిపారు ఓవైసి. ఇక ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కొన్ని సీట్లు ఓడినంత మాత్రాన ఏం పెద్ద నష్టం జరగలేదు అని.. భారతీయ జనతా పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొంటాం అని తెలిపారు. కొన్ని సీట్లు పోయినంత మాత్రాన దాన్ని రాజకీయంగా ఆలోచించే అవసరం లేదు అన్నారు.



Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు


సాధారణ ఎన్నికల సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండదు అని జోస్యం చెప్పారు ఓవైసి (Owaisi). భారతీయ జనతా పార్టిని తెలంగాణ ప్రజలు తప్పకుండా అడ్డుకుంటారు అని తెలిపారు. అనంతరం మేయర్ పోస్టుపై స్పందించిన ఓవైసీ 44 సీట్లు రావడంపై  సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతాం అన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook