Vemulawada: చికెన్ వివాదం... రణరంగాన్ని తలపించిన ఘటన.. యాసిడ్ దాడిలో 10 మందికి గాయాలు
Acid Attack in Vemulawada: చికెన్ వివాదం రణరంగాన్ని తలపించింది. చికెన్ క్వాలిటీగా లేదని షాపు నిర్వాహకుడితో గొడవకు దిగిన కొందరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
Acid Attack in Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ ప్రాంతం చికెన్ గొడవతో రణరంగాన్ని తలపించింది. స్థానికంగా చికెన్ షాపు నిర్వహిస్తున్న హరీష్ అనే వ్యక్తి వద్ద సప్తగిరి కాలనీకి చెందిన చిరు వ్యాపారులు చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి చికెన్ వండుకున్నాక... కర్రీ వాసన వస్తోందని, క్వాలిటీ చికెన్ ఇవ్వలేదని మళ్లీ చికెన్ షాపు వద్దకు వెళ్లారు. చికెన్ క్వాలిటీపై షాపు నిర్వాహకుడు హరీష్‌తో గొడవకు దిగారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లింది.
ఈ క్రమంలో హరీష్‌కు మద్దతుగా కొందరు, గొడవకు దిగిన చిరువ్యాపారులకు మద్దతుగా కొందరు అక్కడికి చేరుకున్నారు. ఇరువురు కర్రలతో దాడులకు దిగారు. అదే సమయంలో సదరు చిరు వ్యాపారులు యాసిడ్‌తో దాడి చేయడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఇరువర్గాల దాడితో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. యాసిడ్ దాడిలో గాయపడినవారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దాడిలో గాయపడిన వ్యక్తి ఒకరు మాట్లాడుతూ... చికెన్ షాపు ముందు గొడవ జరుగుతుండగా అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. ఇరువురిని ఆపే ప్రయత్నం చేయబోగా తనపై కూడా దాడి జరిగిందన్నారు. గొడవకు దిగిన చిరు వ్యాపారులు గంజాయి మత్తులో ఉన్నారని ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!
Also Read: Rana Daggubati: మీరు తల్లి కాబోతున్నారా?.. 'భీమ్లా నాయక్' హీరో సతీమణి ఏం చెప్పారంటే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook