Rana Daggubati wife Miheeka gives a clarity about her pregnancy rumours: 2021 కరోనా లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న హల్క్.. మిహికాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. రానా, మిహికా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు. అయితే గత కొన్నిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు చేస్తున్నాయి. ఇందుకు కారణం మిహికా పోస్ట్ చేసిన ఫొటోలే.
రానా సతీమణి మిహికా సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. మిహికా సోషల్ మీడియాలో భర్త రానాతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికపుడు షేర్ చేస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత పోస్ట్ చేసిన ఫొటోల కంటే.. ఇటీవల షేర్ చేసిన ఫొటోలో మిహికా కొద్దిగా బొద్దుగా ఉన్నారు. దీంతో అభిమానులు 'మిహికా మీరు తల్లికాబోతున్నారా?' అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. 'అలాంటిదేమి లేదు.. పెళ్లి తరువాత అమ్మాయిలో వచ్చే సహజ మార్పు మాత్రమే ఇది' అని రానా సతీమణి బదులిచ్చారు.
మిహికా సమాధానంతో రానా అభిమానులకు నిరాశ ఎదురయ్యింది. మొత్తానికి మిహికా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం రానాకు 37 ఏళ్లు కాగా.. మిహికాకు 28 ఏళ్లు. త్వరలోనే ఈ జంట శుభవార్తను చెప్తుందేమో చూడాలి. రానా ఇటీవల విడులైన భీమ్లా నాయక్ సినిమాలో కీలక పాత్ర చేయాడు. పవన్ కళ్యాణ్ పాత్రకు ధీటుగా రానా నటించారు. దాంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం బాబాయ్ వెంకటేష్ తో కలిసి 'నాయుడు' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఇక విరాటపర్వం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: Hyderabad Metro Offer: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.59తో రోజంతా మెట్రో ప్రయాణం! కండిషన్ అప్లై!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook