Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు చుక్కలు.. కిలో చికెన్ ఎంతంటే?

Chicken Price Hike: చికెన్ రేటు భారీగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో కోడి మాంసం ధర రూ. 280 పలుకుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 03:36 PM IST
  • భారీగా పెరిగిన కోడి మాంసం ధరలు
  • రూ. 280కి ఎగబాకిన చికెన్ రేటు
  • ఇంకా పెరిగే అవకాశం ఉందన్న కోళ్ల పరిశ్రమ వర్గాలు
Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో మాంసం ప్రియులకు చుక్కలు.. కిలో చికెన్ ఎంతంటే?

Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు (Chicken Rates) చుక్కలు  చూపిస్తున్నాయి. 20 రోజుల క్రితం కిలో మాంసం రూ.175 ఉండగా.. తాజాగా రూ.280కి పెరిగింది. అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశముందని కోళ్ల పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు సగటున 10 లక్షల కిలోల కోడి మాంసం అమ్మతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 15 లక్షల కిలోల చికెన్ ను విక్రయించినట్లు సమాచారం. కొవిడ్ (Covid-19) కేసులు తగ్గుముఖం పట్టడంతో.. గత పది రోజుల్లో  రోజుకు అదనంగా లక్ష నుంచి 2 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు పెరిగాయి. 

చలికాలం పోయి..వేసవి కాలం వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఈ వాతావరణ మార్పుల కారణంగా కోడిపిల్లలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు సోయాచెక్క, మొక్కజొన్న దాణా రేట్లు భారీగా పెరిగాయి. క్వింటాలు సోయాచెక్క దాణా ధర సంవత్సరం కిందట రూ.4 వేల నుంచి 5 వేలు ఉండగా.. ప్రస్తుతం 7,200 రూపాయలు పలుకుతోంది. ఈ కారణాల వల్లే చికెన్ ధరలు (Chiken Price) పెరిగాయి. 

నాటుకోడి మాంసం ధర కిలో రూ.400 నుంచి 500కి పెరిగింది. నాటుకోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో..రేట్లను పెంచుతున్నారు. మధ్యప్రదేశ్‌ అడవుల్లో పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అక్కడి నుంచి కోళ్లను తెచ్చి.. ఇక్కడి ఫారాల్లో పెంచి కిలో మాంసం రూ.500కి విక్రయిస్తున్నారు. ఈ మాంసంలో మంచి పోషకాలుంటాయనే ప్రచారంతో...దీనిని కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. 

Also Read: Yadadri Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు కూలీలు దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News