Balka Suman on Revanth Reddy: : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీకి ఔట్ సోర్సింగ్ ఏజెంట్‌గా మారాడని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని హోల్‌సేల్‌గా బీజేపీకి తాకట్టు పెడుతాడని అన్నారు. రాహుల్ గాంధీ ట్వీట్లు చేయడంపై కాకుండా తెలంగాణలో రేవంత్ బారి నుంచి కాంగ్రెస్‌ను కాపాడుకోవడంపై దృష్టి సారించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీ విధానానికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు పలుకుతోందన్నారు. టీఆర్ఎస్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక ఎంపీగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించని రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడని బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రైతులను రేవంత్ గందరగోళపరుస్తున్నాడని... ఒకప్పుడు సోనియా గాంధీని బలి దేవత అన్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణ దేవత అంటున్నాడని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చెప్పులు మోసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారాడని ఆరోపించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కడుతుంటే వాటికి అడ్డు తగిలింది కాంగ్రెస్ నేతలేనని.. కోర్టుల్లో కేసులు వేశారని బాల్క సుమన్ ఆరోపించారు.


పెయింటర్ రెడ్డి నుంచి రేవంత్ పెయిడ్ రెడ్డిగా మారారని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్‌ది అంతా నకిలీ మకిలీ చరిత్రేనని విమర్శించారు.
ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అవినీతి డబ్బుతో ఖూనీ చేసిన రేవంత్ నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోరని ఫైర్ అయిన బాల్క సుమన్.. కేటీఆర్ గ్లోబల్ లీడర్ అని పేర్కొన్నారు. ఏడు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు సాధించారని అన్నారు. రేవంత్ ఒక 420 అని.. కేటీఆర్ ముందు రవ్వంత అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రగతిలో రేవంత్ రెడ్డి ఒక ముళ్లులా మారారని.. ఇకనైనా పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.


ధాన్యం కొనుగోళ్ల విషయంలో పంచాయతీ స్థాయి నుంచి ప్రధాని మోదీకి తీర్మానాలు పంపుతున్నామని బాల్క సుమన్ అన్నారు. ఇదంతా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉగాది తర్వాత బీజేపీ భరతం పడుతామని హెచ్చరించారు. రైతులను వంచిండంలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు.


Also Read: Revanth Reddy on KTR: ఆగని ట్విట్టర్ వార్... కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్...


CM KCR: ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్... చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook