Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ కేబినెట్ లో 16 మంది మంత్రులతో పాటు ఇంకొంత మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. ఆ నేతలు డ్రగ్స్ కు బానిసలు అవడమే కాకుండా వాళ్ల అనుచరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి తమ వైపు తిప్పుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్లందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం అంతా ఉత్తి భోగస్ మాటలు. అదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించిన బండి సంజయ్.. ఆ డ్రామాతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చిపారేశారు. బీజేపికి ఎలాంటి సంబంధం లేదు కనుకే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తడిబట్టలతో వెళ్లి యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారు. మరి ఏ తప్పు చేయకపోతే.. కేసీఆర్ ఎందుకు యాదాద్రికి రాలేదు అని నిలదీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రం అంతా సంప్రోక్షణ చేస్తాం
హామీలు అమలు చేయకుండా మాట తప్పిన మీలాంటి మోసగాళ్లు తిరిగిన తెలంగాణ గడ్డ అపవిత్రమైంది. అందుకే తెలంగాణలో బీజేపి అధికారంలోకి రాగానే ముందుగా తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో పాటు ఇతర బీజేపి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 


మంత్రి కేటీఆర్ ని ఉద్ధేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. నువ్వు, నీ అయ్య నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలే. నువ్వు ఒక్కటి మాట్లాడితే దానికి బదులుగా మేం వంద మాట్లాడగలం. కానీ మీలా కాదు. మాకు సంస్కారం అడ్డొస్తుంది అని బండి సంజయ్ మండిపడ్డారు. అయినా తాను యాదాద్రి ఆలయానికి వచ్చినప్పుడు నీ అయ్య యాడికి పోయిండు ? ఎందుకు బీజేపి విసిరిన సవాల్‌ను స్వీకరించలేదు ? అని ప్రశ్నించారు. 


తాగి మీ అయ్యనే కొడతవు..
అమిత్ షా అంటే మాకు గురు సమానులు. గురువు అంటే దైవంతో సమానం. అవసరమైతే గురువుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాం. అలాగే ఆరోజు చెప్పులు అందిస్తే ఏదో తప్పు చేశానన్నట్టు రాద్ధాంతం చేశారు. అయినా మీ సంగతి ఎవరికి తెల్వదు కనుక అంటూ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ పై బండి విరుచుకుపడ్డారు. నువ్వు ( కేటీఆర్ ) తాగి తండ్రిని కొడితే... మీ అయ్య (కేసీఆర్) ఆయన గురువు జయశంకర్ సార్‌ను కొట్టిండు. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిండు. అందుకే ముందుగా మీ నోరు సంప్రోక్షణ చేయాలి అని ఎద్దేవా చేశారు. అయ్యా, కొడుకుల నోర్లు ఫినాయిల్ తీసుకొచ్చి కడగాలి అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై బండి సంజయ్ ( Bandi Sanjay ) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


Also Read : TRS vs BJP: యాదాద్రిలో బండి సంజయ్ ప్రమాణం.. ఎన్నికల అధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు


Also Read : Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డి వివరణపై ఈసి అసంతృప్తి.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు


Also Read : KTR COMMENTS: ఎమ్మెల్యే బేరసారాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి