EC Action on Jagadish Reddy: కేంద్ర ఎన్నికల సంఘం మంత్రి జగదీష్ రెడ్డికి షాకిచ్చింది. మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో చురుకుగా పాల్గొంటూ ఈ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మంత్రి జగదీష్ రెడ్డిపై 48 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని నిషేధం విధించింది. పబ్లిక్ మీటింగ్స్, ఎన్నికల ర్యాలీలు, ఊరేగింపులు, రోడ్ షోలు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని కేంద్రం ఎన్నికల సంఘం మంత్రి జగదీష్ రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. అక్టోబర్ 29వ తేదీ.. అంటే నేటి నుంచి రాత్రి 7 గంటల నుంచి మంత్రి జగదీష్ రెడ్డిపై ఈ నిషేధం అమలులో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.
అక్టోబర్ 25న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘం అక్టోబర్ 28న షోకాజ్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. '' మునుగోడు ఉప ఎన్నికలో పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య కాదని, రూ. 2 వేల ఆసరా పెన్షన్ కొనసాగించాలా వద్దా, రైతు బంధు పథకం కొనసాగించాలా వద్దా ?, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించాలా లేక నిలిపేయాలా ? దివ్యాంగులకు రూ. 3 వేల కొనసాగించాలా వద్దా ?.. ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలా వద్దా అనే నిర్ణయంపై ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుందని,.. ఈ సంక్షేమ పథకాల ఫలాలు కావాలని కోరుకునే వాళ్లు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయండని.. వద్దనుకునే వాళ్లు మోదీకి ఓటేయండి '' అని వ్యాఖ్యలు చేసినట్టు ఈసి గుర్తించింది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలపై ఈసికి వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారే ఈ సంక్షేమ పథకాలు అందిస్తోంది అనే విషయాన్ని చెప్పడమే తన వ్యాఖ్యల వెనుకున్న ముఖ్య ఉద్దేశం అని మంత్రి జగదీష్ రెడ్డి తన వివరణలో పేర్కొన్నారు. అయితే, జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy ) వివరణతో సంతృప్తి పడని ఎన్నికల సంఘం.. ఆయన 48 గంటల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు స్పష్టంచేసింది.
Also Read : Q NEWS ఆఫీసుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరుల దాడి
Also Read : KTR COMMENTS: ఎమ్మెల్యే బేరసారాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read : TRS MLAS BRIBE: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బిగ్ ట్విస్ట్.. మళ్లీ పోలీసుల అదుపులోకి నిందితులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి