Rythu Bharosa: అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే హామీలు నెరవేరుస్తామని చెప్పి మోసం చేయడంతో అన్ని వర్గాలతోపాటు రైతులు రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వ్యవసాయం చేసే రైతులకు సంబంధించిన పెట్టుబడి సహాయం రైతు బంధును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా అమలు చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటిన నెల తర్వాత అందిస్తోంది. సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సంక్రాంతికి పండుగ కానుకగా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తామని మంత్రివర్గ ఉప సంఘం తెలిపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: K Kavitha: రేవంత్‌ రెడ్డి వైఫల్యాలపై ఎల్లుండి కల్వకుంట్ల కవిత భారీ బహిరంగ సభ


పెట్టుబడి సహాయం అందించే పథకానికి రైతు భరోసాగా పేరు మార్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ పథకం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. పలుమార్లు సమావేశమైన ఈ కమిటీ తాజాగా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించింది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయాలని ప్రకటించింది.

Also Read: KTR ACB Case: 'పాపం రేవంత్ రెడ్డి.. నన్ను జైలుకు పంపాలని విశ్వ ప్రయత్నాలు'


హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో గురువారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై కొన్ని గంటల పాటు రైతు భరోసా అమలుపై చర్చించింది. వ్యవసాయ అధికారులతోపాటు ఆర్థిక శాఖ వారితో మంత్రులు సమాలోచనలు చేశారు. ఈ క్రమంలో పంట పండించే ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వాలని చర్చ జరిగింది. రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు రైతులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.


రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఎవరికీ అందించాలనే అంశంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శాటిలైట్‌ మ్యాపింగ్‌ ద్వారా సాగు భూములను గుర్తించి అనంతరం పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ధరణి ప్రకారం కోటి 53 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. సాగు చేయని భూములు తీసేస్తే కోటి 30 లక్షల ఎకరాలకు రైతు భరోసా అందించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆదివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.