Etela Rajender Challenge to CM KCR Govt: కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని.. ఈ ప్రభుత్వాన్ని కాపాడే శక్తి దేవుడు కూడా కోల్పోయాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని.. రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజాగోస-బీజేపీ భరోసా.. బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 11 వేల కార్నర్ మీటింగ్స్ నడుస్తున్నాయని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సాయన్న గారు ఒక దళిత బిడ్డ. వరుసగా ఐదు సార్లు గెలిచారు. అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలేదు. కేసీఆఆర్ దొర అహంకారం బయటపడింది. దళితుల పట్ల ఆయన వైఖరి తేటతెల్లం అయ్యింది. ఆయన అవమానపరిచింది సాయన్నను కాదు దళిత జాతిని. 85 శాతం అణగారినవర్గాలు ఉన్న రాష్ట్రం మనది. దళిత ముఖ్యమంత్రి పక్కన పెడితే వారికి కనీస గౌరవం కూడా దక్కటం లేదు. తెలంగాణకు గుండెకాయ లాంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క దళిత గిరిజన బీసీ మైనారిటీ బిడ్డ అధికారులు కూడా లేరు. మూడుఎకరాల భూమి ఇస్తానని దళితులను, గిరిజనులను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్.


'డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా మోసం చేసి బుకాయిస్తున్న పార్టీ బీఆర్ఎస్. నాయకులు కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు. అసెంబ్లీ ప్రజాస్వామ్య ప్రతీక. తెలంగాణ ప్రజల భవిష్యత్తు రాసే వేదిక. అక్కడ మా గొంతు నొక్కేసి ప్రజలను వంచించె ప్రక్రియ కొనసాగింది. అందుకే ప్రజావేదికల మీదకి వచ్చాం. ధరణి మా పేదల కొంపలు ముంచింది. ఎప్పుడో దొరల దగ్గర కొనుక్కున్న, దున్నుకున్న భూములు మళ్లీ దొరల పేరు మీదకు ఎక్కాయి. ఈ దుర్మార్గానికి కారకుడు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడితే పేదల బతుకులు మారుతాయనుకుంటే ఆ పేదలను బిచ్చగాల్లుగా చేసిన వ్యక్తి కేసీఆర్. అసెంబ్లీలో ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తే అది చిన్న విషయం.. కోడుగుడ్డు మీద ఈకలు పీకవద్దు అని మాట్లాడారు. బుకాయించారు. సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయలేదు..' అని ఈటల రాజేందర్ ఫైర అయ్యారు.


క్వింటాల్ వడ్లకు 10 కేజీలు కట్ చేస్తున్నారని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ అంశాన్ని పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని మంత్రికి సూచన చేయాల్సింది పోయి.. ఆయనే అలాంటిదేమీ జరగడంలేదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. సర్కారు దుర్మార్గానికి, దాష్టకానికి రాష్ట్రంలో వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బిల్లలు రాక సర్పంచులు, కాంట్రాక్టర్లు ఉద్యోగాలు యువత, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. 


తెలంగాణలో 24 గంటల మూడు ఫేజ్‌ల కరెంట్ వస్తుందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని ఈటల సవాల్ విసిరారు. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారని.. రైతు రుణమాఫీ చేయలేదన్నారు. కుట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తీస్తా అన్నట్లు అబ్ కి బార్ కిసాన్ కి సర్కార్ అని పోతున్నాడని ఎద్దేవా చేశారు. కళ్యాణ లక్ష్మి 3 వేల కోట్లు, పెన్షన్ల కోసం 11 వేల కోట్లు, రైతు బంధు 14 వేల కోట్లు మొత్తం 30 వేల కోట్లు ఇచ్చి.. మద్యం మీద 45 వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. కేసీసఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని.. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. 


Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్‌ఫుల్   


 Also Read: PM Kisan Samman Nidhi: పీఎం కిసాన్ లబ్ధిదారులకు ముఖ్యగమనిక.. మీ ఖాతాలో నగదు ఎప్పుడు జమకానుందంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook