Revanth Reddy: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు రాజకీయాలు చేస్తోంది బీజేపీ. తెలంగాణకు సంబంధించి బీజేపీ హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రానికి వరుసగా వస్తున్న కమలం పార్టీ అగ్ర నేతలు.. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. మునుగోడు బహిరంగసభకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావుతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో మంతనాలు సాగించారు. అమిత్ షా, తారక్ భేటీ రాజకీయ సెగలు రేపింది. ఇక హన్మకొండ సభకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టాలీవుడ్ హీరో నితిన్ ను కలవడం ఆసక్తి రేపింది. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి నాలుగో విడత యాత్ర చేపట్టనున్న బండి సంజయ్.. ఈసారి పెద్ద టార్గెటే పెట్టుకున్నారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగో విడత యాత్రలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బండి సంజయ్ టార్గెట్ చేయనున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర సాగనుందట. మొదటి మూడు విడతల్లో గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన సంజయ్.. ఈసారి అర్బన్ పై ఫోకస్ చేశారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గడ్డలో యాత్రను సక్సెస్ చేస్తే కాంగ్రెస్ ను మరింత బలహీనం చేయవచ్చన్న ప్లాన్ లో తెలంగాణ కాషాయ నేతలు ఉన్నారంటున్నారు.మల్కాజ్ గిరి పరిధిలో చేపట్టడానికి మరో కారణం కూడా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక అక్టోబర్ లో జరిగే అవకాశం ఉంది. మునుగోడుకు సంబంధించిన ఓటర్లు మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో భారీగా ఉన్నారు. దాదాపుగా 50 వేల మంది మునుగోడు ఓటర్లు ఈ నియోజకవర్గాల్లో ఉన్నారని లెక్కలు వేశారట కమలనాధులు. దీంతో నాలుగో విడత పాదయాత్రలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే మునుగోడు బైపోల్ లో కలిసివచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.


మల్కాజ్ గిరి పరిధిలో పాదయాత్ర చేస్తే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాన్ని దగ్గరగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి రావడం కూడా సులభమవుతుంది. నాలుగో విడత పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ రెండు మూడు రోజుల్లో ఖరారు అవుతుందని చెబుతున్నారు. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలతో పాటు జీహెచ్ఎంసీ నేతలతో చర్చించి తుది రూట్ మ్యాప్ ఫైనల్ చేయనున్నారు. బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజవర్గం నుంచి సంజయ్ యాత్ర మొదల.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద ముగించనున్నారని సమాచారం.  అబ్దుల్లాపూర్ మెట్ దాటగానే మునుగోడు నియోజకవర్గం ఎంటరవుతుంది.దీంతో నాలుగో విడతను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంతో పాటు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఉపయోగపడేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.


నాలుగో విడత యాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ ఆలయం లేదా సూరారం కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రారంభించే యోచనలో బండి సంజయ్ ఉన్నారంటున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుందట. ప్రతినియోజకవర్గంలో ఒక రోజు పాటు యాత్ర కొనసాగిస్తూ భారీ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది బండి సంజయ్ టీమ్. రేవంత్ రెడ్డి గడ్డలో బీజేపీ పాదయాత్ర సాగనుండటంతో రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.


Read also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు.. సిసోడియా బ్యాంక్ లాకర్లు ఓపెన్.. నెక్స్ట్ కవితేనా?


Read also: Metro Train: మెట్రో రైలులో స్నానం.. ప్రశ్నించిన ప్రయాణికుడిపై దాడి.. వైరల్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి