Viral Video: మెట్రో రైలులో స్నానం.. ప్రశ్నించిన ప్రయాణికుడిపై దాడి.. వైరల్ వీడియో

Metro Train: ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుందని అంటారు. కొందరు జనాలు పిచ్చిపిచ్చి చేష్టలతో ఇతరులకు ఇబ్బంది కల్గిస్తుంటారు. పక్కవాళ్లను పట్టించుకోకుండా కొందరు తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవరిస్తుంటారు. ఇంకొందరు వీడియోల కోసమే, పబ్లిసిటి కోసమే చిల్లర వేషాలు వేస్తుంటారు

Written by - Srisailam | Last Updated : Aug 30, 2022, 12:51 PM IST
Viral Video: మెట్రో రైలులో స్నానం.. ప్రశ్నించిన ప్రయాణికుడిపై దాడి.. వైరల్ వీడియో

Metro Train: ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఉంటుందని అంటారు. కొందరు జనాలు పిచ్చిపిచ్చి చేష్టలతో ఇతరులకు ఇబ్బంది కల్గిస్తుంటారు. పక్కవాళ్లను పట్టించుకోకుండా కొందరు తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవరిస్తుంటారు. ఇంకొందరు వీడియోల కోసమే, పబ్లిసిటి కోసమే చిల్లర వేషాలు వేస్తుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి మెట్రో రైలులో పిచ్చిగా ప్రవర్తింటాడు. అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెట్రోలో ప్రయాణించిన ఓ వ్యక్తి చిల్లరగా వ్యవహరించాడు. మెట్రో రైలులో ఒక బాత్ టబ్ పెట్టుకొని బాటిల్‌లోని నీళ్లను పోసుకుంటు స్నానం చేస్తున్నాడు. మెట్రోలో స్నానం చేస్తుండటంతో సహ ప్రయాణికులు షాకయ్యారు. స్నానం చేస్తుండగా ఆ నీళ్లు వేరే ప్రయాణికుడిపై పడటంతో అతని ప్రశ్నించాడు. అయితే ఇదేంటని అడిగిన పాపానికి అతనిపై దాడి చేశాడు మెట్రో రైలులో స్నానం చేస్తున్న వ్యక్తి. న్యూయార్క్ మెట్రోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. అది వైరల్ గా మారింది.

మెట్రో రైలులో స్నానం చేసిన వ్యక్తిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఫన్నీ కామెంట్లు పెట్టారు.

Read also: CM Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ దూకుడు..31న బీహార్‌కు గులాబీ నేత..!

Read also: Kuppam Clash: కుప్పంలో మళ్లీ అల్లర్లు..చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ధ్వంసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News