Bandi Sanjay Slams CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికెట్ బయటపెట్టు అంటూ బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. పీఎం మోదీ సమాజాన్ని చదివి దేశాన్ని అగ్రపథంలోకి తీసుకెళుతుంటే.. కేసీఆర్ కుటుంబం చదువుకున్న చదువును డ్రగ్స్, పత్తాలు, దొంగ సారా దందాకు ఉపయోగిస్తూ వేల కోట్లు దోచుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటే బీరు.. రమ్.. స్కాచ్ పార్టీ అని, కేసీఆర్ కుటుంబం అంతా అంతర్జాతీయ దొంగల ముఠాకు నాయకులని ఎద్దేవా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 ఏళ్ల క్రితం ఇల్లు తప్ప ఏమీలేని కేసీఆర్ నేడు వేల కోట్లతో ప్రతిపక్ష పార్టీలకు డబ్బులిచ్చే స్థాయికి ఎట్లా ఎదిగారని ప్రశ్నించారు. ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించబోయే సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితురులతో కలిసి పరేడ్ మైదానానికి వచ్చారు బండి సంజయ్. 


ఈ సందర్భంగా  మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ప్రధాని మోదీ సమాజాన్ని చదివిన వ్యక్తి అని.. దేశాన్ని అభివృద్ది బాటలోకి తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే భారత్‌ను 5వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. '80 వేల పుస్తకాలు చదువుకున్న మీ అయ్య చదువు ఏమైంది..? ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ చదివినని మీ అయ్య చెప్పిండు.. నీకు చేతనైతే ముందు ఆ సర్టిఫికెట్‌ను బయట పెట్టు. కేసీఆర్ దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్స్ తయారు చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసినట్లున్నడు.


మిగులు రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు.. బీఆర్ఎస్ అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా. స్కీమ్‌ల ద్వారా ఏ విధంగా స్కామ్‌లు చేయాలో ట్రైనింగ్ ఇచ్చే సంస్థ బీఆర్ఎస్ భవన్. బీఆర్ఎస్ అంటేనే బీరు.. రమ్ము, స్కాచ్ పార్టీ.. కేసీఆర్ పాలనలో అన్నీ లీకులే.. ఆయన తాగి పడుకుంటడు.. ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం. లీకుల జాతర నడుస్తోంది. అవినీతి సొమ్ముతో పొట్టుపొట్టు పైసలు సంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టారు. కేసీఆర్.. 8 ఏళ్ల క్రితం నీ బతుకేంది. నందినగర్లో ఓ ఇల్లు మాత్రమే ఉండే.. నీ బిడ్డ అపార్ట్ మెంట్లో అద్దెకుంది. నీ కొడుకుకు ఇల్లేలేదు. ఇప్పుడు వేల కోట్లు ఎట్లా సంపాదించినవ్..? రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఎట్లా అంధకారమైంది..?' అని బండి సంజయ్ ప్రశ్నించారు. 


Also Read: SSC Question Paper Leak: మరో టెన్త్ పేపర్ లీక్.. వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు  


Also Read: IPL Points Table: టాప్‌లేపిన రాజస్థాన్.. హైదరాబాద్ పరిస్థితి దారుణం.. మిగిలిన జట్లు ఇలా..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి