BJP Vs BRS: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నడిచింది. అంతేకాదు గతంలో ఎన్నడు లేనట్టుగా బీఆర్ఎస్ ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేకపోయింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే గులాబీ బాస్ .. తన క్యాడర్ బేస్ ఓటును బీజేపీకి షిఫ్ట్ చేయించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైతేనేం.. ఎంపీ ఎన్నికల్లో   గుండు సున్నా తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ.. పార్టీ ఫలితాలను చూసి డీలా పడింది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆ తర్వాత తెలంగాణలో అధికార పార్టీ.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ కు చెందిన అరికెపూడి గాంధీకి ఇవ్వడంతో దుమారం రేగింది. అయితే.. పీఏసీ చైర్మన్ పదవి .. ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇపుడు కూడా కాంగ్రెస్ కూడా తాము కాంగ్రెస్ పార్టీకి కాకుండా.. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతనే ఎంపిక చేసినట్టు చెప్పారు. కానీ బీఆర్ఎస్ మాత్రం మా అనుమతి లేకుండా మీరు చేసిన ఎన్నిక చెల్లదంటూ పాడి కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని రచ్చ కీడ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పుంజుకున్నట్టు కనిపించింది. అంతేకాదు హైడ్రా కూలివేతలు తదితర అంశాలను తనకు అనుకూలంగా మార్చుకుంది. అదే సమయంలో బీజేపీ ఈ పోటీలో వెనకబడ్టట్టు కనిపించింది.


తాజాగా గ్రూపు 1 అభ్యర్ధులతో పాటు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూలతో మరోసారి బీజేపీ.. బీఆర్ఎస్ పై పై చేయి సాధించింది.  
ముఖ్యంగా రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన బీజేపీ ఆ ఇష్యూని టేకప్ చేయాలని భావించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ అయ్యారు. గాంధీనగర్ వెళ్లి గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు సంఘీభావం తెలపడంతో పాటు చలో సెక్రెటేరియట్ కు పిలుపునివ్వడంతో పాటు వారితో కలిసి నడిచారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ప్రోగ్రాంను బీజేపీ హైజాక్ చేసినట్లయింది. అందివచ్చిన అవకాశాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జారవిడిచారని పార్టీ నేతలు అసహనంతో ఉన్నారు. వారిపక్షాన బీఆర్ఎస్ ముందుస్తుగా చలో సచివాలయం నిర్ణయిస్తే అభ్యర్థులతో పాటు నిరుద్యోగుల్లోనూ, యువతలోనూ మంచి ఆదరణ వచ్చేదని గులాబీ కేడర్‌ అభిప్రాయపడుతోంది. అటు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ లో పెద్ద డ్యామేజీ క్రియేట్ అయింది. అదే సమయంలో బీజేపీ ఈ ఇష్యూను పబ్లిక్ లో తీసుకెళ్లడంలో పై చేయి సాధించింది.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter