Dubbaka Final Result: దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం
నువ్వా నేనా రీతిలో సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ( Dubbaka Bypoll Results ) చివరికి బీజేపీవైపు మొగ్గు చూపాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందర్ రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిని సుజాతపై 1118 ఓట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
నువ్వా నేనా రీతిలో సాగిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ( Dubbaka Bypoll Results ) చివరికి బీజేపీవైపు మొగ్గు చూపాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందర్ రావు తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిని సుజాతపై 1118 ఓట్ల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
దుబ్బాక ఉప ఎన్నిక ( Dubbaka Bypoll ) చరిత్ర సృష్టించాయి. అధికారపార్టీ టీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. విజయం తమదేనని ధీమా వ్యక్తంచేసిన అధికారపార్టీకు షాక్ తగిలింది. పోటీ నువ్వానేనా రీతిలో సాగింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి..అనూహ్యంగా బీజేపీ ( Bjp) ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చింది. మొదటి 5 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ...టీఆర్ఎస్ ( TRS ) పై 4 వేల పై చిలుకు మెజార్టీ సాధించింది. అనంతరం 6వ రౌండ్ నుంచి నువ్వా నేనా రీతిలో మెజార్టీ సాగింది.
13 నుంచి 18వ రౌండ్ వరకూ ఫలితం మారిపోయింది. బీజేపీ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించి..మెజార్టీను 173 ఓట్లు పరిమితం చేసింది టీఆర్ఎస్. . 18 వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం ఎక్కువగా ఉండటంతో...బీజేపీ ఆదిక్యం ( Bjp Majority ) 173కు తగ్గిపోయింది. Also read: Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం
19వ రౌండ్ లో కూడా టీఆర్ఎస్ ఆధిక్య కనబరిచింది. 19 వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ తొలిసారి 251 ఓట్లు మెజార్టీకు చేరుకుంది. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీకు 53 వేల 53 ఓట్లు సాధించగా..బీజేపీ 52 వేల 802 ఓట్లు సాధించింది. ఈ దశలో నార్సింగి, చేగుంట ప్రాంతాల కౌంటింగ్ మిగిలుంది. దాంతో బీజేపీ ఆశలు మళ్లీ చిగురించాయి. బీజేపీ ( BJP ) ఊహించినట్టుగానే ఈ ప్రాంతాలకు సంబంధించిన 20, 21, 22, 23 రౌండ్లలో వరుస ఆధిక్యతను కొనసాగించి...విజయాన్ని కైవసం చేసుకుంది బీజేపీ.
తెలంగాణ (Telangana ) రాష్ట్రం ఏర్పడ్డాక అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నిక, ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి పాలవడం కూడా ఇదే తొలిసారి. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు 1118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో..టీఆర్ఎస్ పార్టీ 62 వేల 22 ఓట్లు సాధించగా..విజయం సాధించిన బీజేపీ 63 వేల 140 ఓట్లు దక్కించుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీకు ఈ ఎన్నికల్లో 21 వేల 961 ఓట్లు లభించాయి. Also read: Dubbaka Bypoll Round Wise details: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ