Dubbaka Bypoll Round Wise details: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారపార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా పోటీ సాగుతోంది. రౌండ్..రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. ఫలితాలు రెండు పార్టీల  మధ్య దోబూచులాడుతున్నాయి.

Last Updated : Nov 10, 2020, 04:04 PM IST
Dubbaka Bypoll Round Wise details: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ( Dubbaka Bypoll Results ) ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారపార్టీ టీఆర్ఎస్ ( TRS ), బీజేపీ ( BJP ) మధ్య నువ్వా నేనా పోటీ సాగుతోంది. రౌండ్..రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. ఫలితాలు రెండు పార్టీల  మధ్య దోబూచులాడుతున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికల్లో( Dubbaka Bypoll ) విజయం తమదేనని ధీమా వ్యక్తంచేసిన అధికారపార్టీకు పరిస్థితి అంత సులభంగా కన్పించడం లేదు. పోటీ నువ్వానేనా రీతిలో సాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి..అనూహ్యంగా బీజేపీ ( Bjp) ఆధిక్యం ప్రదర్శిస్తూ కన్పిస్తోంది. మొదటి 5 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ...టీఆర్ఎస్ ( TRS ) పై 4 వేల పై చిలుకు మెజార్టీ సాధించింది. అనంతరం 6వ రౌండ్ నుంచి నువ్వా నేనా రీతిలో మెజార్టీ సాగుతోంది. 

18వ రౌండ్ లో ఫలితాలు మరోసారి మారిపోయాయి. 18వ రౌండ్ లో టీఆర్ఎస్ అనూహ్యంగా పుంజుకోవడంతో బీజేపీ ఆధిక్యం 16 వందల నుంచి ఒక్కసారిగా 173 ఓట్లకు తగ్గిపోయింది. 18 వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం ఎక్కువగా ఉండటంతో...బీజేపీ ఆదిక్యం ( Bjp Majority ) 173కు తగ్గిపోయింది.  Also read:  Bihar Election Result: ఓట్ల లెక్కింపు ప్రారంభం 

19వ రౌండ్ లో పరిస్థితి మరోసారి మారింది. 19 వ రౌండ్ లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం సాధించి..బీజేపీ ఓవరాల్ మెజార్టీను తగ్గించేసింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీనే ఆదిక్యం కొనసాగిస్తుండగా..19 వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ తొలిసారి 251 ఓట్లు మెజార్టీకు చేరుకుంది అధికార పార్టీ టీఆర్ఎస్. 19వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీకు 53 వేల 53 ఓట్లు సాధించగా..బీజేపీ 52 వేల 802 ఓట్లు సాధించింది.

ఇంకా 4 రౌండ్ల ఫలితాలు వెలువడాల్సి ఉంది. చేగుంట, నార్శింగి మండలాల ఫలితాలు విజేత ఎవరనేది తేల్చనున్నాయి. ఈ రెండు ప్రాంతాల ఓటింగ్ పై బీజేపీ, టీఆర్ఎస్ లు ఆశలు పెట్టుకున్నాయి. 

20 వ రౌండ్ లో పరిస్థితి బీజేపీ వైపు మళ్లింది. 20వ రౌౌండ్ ముగిసేసరికి బీజేపీ 490 ఓట్ల మెజార్టీ సాధించింది. 

21వ రౌండ్  ఫలితం కూడా వెలువడింది. ఈ రౌండ్ ముగిసేసరికి 268 ఓట్ల మెజార్టీతో బీజేపీ ఉంది. టీఆర్ఎస్ దాదాపు ఓటమి అంచుకు చేరుకుంది. 21వ రౌౌండ్ లో బీజేపీ ఆదిక్యంతో ఓవరాల్ గా మెజార్టీలో నిలిచింది.  బీజేపీ 58 వేల 418 ఓట్లు సాధించగా...టీఆర్ఎస్ 57 వేల 893 ఓట్లు సాధించగలిగింది.  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News