BRS MLA Lasya Nanditha Death News: సికింద్రాబాద్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) మృతితో బీఆర్‌ఎస్ పార్టీ, కంటోన్మెంట్‌ వ్యాప్తంగా విషాధఛాయలు అలుముకున్నాయి. పటాన్‌చేరు ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందారు. ఇదిలా ఉండగా గత ఏడాదే ఆమె తండ్రి సాయన్న కన్నుమూశారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టిక్కెట్ రావడంతో ఆమె గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
 
అయితే, ఈనెల 13న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన సభకు లాస్యనందిత హాజరయ్యారు. తిరుగుప్రయాణంలో నార్కట్ పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడింది. కేవలం పదిరోజుల్లో కారుప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. ఈనేపథ్యంలో ఆమె మృతదేహాన్ని పటాన్‌చెరు అమేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి  


ఇదిలా ఉండగా లాస్యనందిత మరణానికి కారణం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ బాగా డ్యామేజ్ అవ్వడం. లాస్య మృతిపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మాజీ సీఎం కేసీఆర్ లాస్య అకాల మరణం బాధకరమన్నారు. ఆమె కుటుంబానికి అండంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా లాస్య మరణానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. చిన్నవయస్సులోనే మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి లాస్య చనిపోవడం  బాధకరమని మాజీ మంత్రి తలసాని అన్నారు.


ఇదీ చదవండి: నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..


కేటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..


 



కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణానికి కేటీఆర్ కూడా తీవ్ర దిగ్భ్రంతిని వెల్లడించారు. వారం రోజుల క్రితమే లాస్యను పరామర్శించానని సంబంధించిన ఫోటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. లాస్య ఇకలేరు అనే అత్యంత విషాధకరమైన, షాకింగ్ న్యూస్ ఇప్పుడే తెలుసుకున్నానన్నారు. చాలామంచి నాయకురాలు, యువ ఎమ్మెల్యేను కోల్పోవడం తీవ్రనష్టం. ఈ భయంకరమైన, క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు అని పోస్ట్‌ చేశారు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి