BRS MLA Rajaiah: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే రాజయ్య బిగ్‌షాక్.. కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధం
MLA Rajaiah Meet With Damodar Raja Narasimha: కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య రహాస్యంగా సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
MLA Rajaiah Meet With Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగలనుంది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ దక్కిన కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. నియోజకవర్గాల్లోని పలు కార్యక్రమాల్లోనూ కడియం శ్రీహరిపై విమర్శలు చేశారు. ఎమ్మెల్యే రాలేదని తెలిసిన తరువాత కన్నీటి పర్యాంతమయ్యారు. అనుచరులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య రహస్యంగా భేటీ అయ్యారు. ఓ హోటల్ ఇద్దరు నేతలు కలిశారు. ఇదే టైమ్‌లో పార్టీలో చేరిక, టికెట్‌పై మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి సమావేశానికి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. రాజయ్య కాంగ్రెస్ చేరడం లాంఛనమేనని అంటున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా.. కడియం శ్రీహరితో నేడు ఒకే వేదికను పంచుకున్నారు ఎమ్మెల్యే రాజయ్య. ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికపై చేరడం ఆసక్తికరంగా మారింది. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పునప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి నిర్వహించారు. మంత్రి సత్యవతి రాథోడ్ పక్కన రెండు ఖాళీ కుర్చీలు ఉండగా.. కడియం శ్రీహరి, రాజయ్య పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరూ ఒకరినొకరూ ఆత్మీయంగా పలకరించుకుని.. కరచాలనం కూడా చేశారు. ఇద్దరు నవ్వుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకోవడంతో అంతా సవ్యంగా ఉందని అనుకున్నారు. అయితే సడెన్‌గా దామోదర రాజనర్సింహతో భేటీ అయి రాజయ్య ట్విస్ట్ ఇచ్చారు.
Also Read: Jasprit Bumrah Blessed With Baby Boy: తండ్రైన బుమ్రా.. కుమారుడికి డిఫరెంట్ పేరు
Also Read: Power Cuts: రాష్ట్రంలో విద్యుత్ కోతలపై క్లారిటీ.. అసలు కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి