Kalvakuntla Kavitha: ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలు.. బీసీ డిక్లరేషన్‌ అమలు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ ధర్నా చేపట్టనున్నారు. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలు.. బీసీ సమస్యల పరిష్కారానికి గాను కవిత ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద భారీ సభ నిర్వహించనున్నారు. ధర్నా సన్నాహాలపై కవిత బీసీ సంఘాలతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే బీసీ మహాసభ పోస్టర్‌ను హైదరాబాద్‌లో కవిత ఆవిష్కరించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR ACB Case: 'పాపం రేవంత్ రెడ్డి.. నన్ను జైలుకు పంపాలని విశ్వ ప్రయత్నాలు'


పోస్టర్‌ ఆవిష్కరణ అనంతరం కవిత చేపట్టే ధర్నాకు సర్పంచ్‌ల సంఘం జేఏసీ, తెలంగాణ విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ మహాధర్నాకు జిల్లాల నుంచి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడుతున్నట్లు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లపై సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ఈ  నెల 3వ తేదీన ఇందిరా పార్కు వద్ద బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: Harish Rao: ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో రేవంత్‌ రెడ్డి: హరీశ్ రావు ఆగ్రహం


కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు, రిజర్వేషన్ల పెంపు ప్రధాన డిమాండ్లుగా తాము మహాసభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. 


బీసీల కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితకు తాము వెన్నుదన్నుగా నిలుస్తామని సర్పంచ్‌ల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ప్రకటించారు. తాము కూడా పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరవుతామని.. తమ హక్కులను సాధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కవిత ఆవిష్కరించిన బీసీ మహాసభ పోస్టర్‌ను తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ కళాశాల వద్ద ప్రదర్శన చేశారు. కవిత చేపట్టిన మహాధర్నాకు పెద్ద ఎత్తున పాల్గొంటామని ప్రకటించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.