Pending Salaries: తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనతో ప్రతి ఒక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో.. వారిలో పేదరిక నిర్మూలన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది కూడా నరకం అనుభవిస్తున్నారు. సమయానికి జీతాలు చెల్లించకపోవడంతో వారు బతుకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.
Also Read: KT Rama Rao: మన్మోహన్ సింగ్‌ను అవమానించిన రాహుల్ గాంధీ.. ఇది తగునా అంటూ కేటీఆర్ ఆగ్రహం
ఈ మేరకు మంగళవారం 'ఎక్స్'లో హరీశ్ రావు స్పందిస్తూ కీలక పోస్టు చేశారు. 'పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తాం అంటూ డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులకు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం శోచనీయం' అని పేర్కొన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6000 మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం' అని తెలిపారు.
Also Read: New Year Alert: న్యూ ఇయర్‌కు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు మూసివేత
'పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లింది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అయినా ఆర్పిల పెండింగ్ జీతాలను చెల్లించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాగా నెలల తరబడి జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు అప్పులపాలవుతున్నాయని ఆర్పీలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరుతూ ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరిని బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధి బృందం కలిసి మద్దతు తెలిపే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook