హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్‌పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. రెండు సంవత్సరాల క్రితమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన పై వంతెన ( Amberpet flyover ) నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి ( Nitin Gadkari ) చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పటికీ.. ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభం కాలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. జిహెచ్ఎంసి స్థల సేకరణ పూర్తి చేయాల్సి ఉన్నందున.. త్వరగా స్థల సేకరణ పూర్తిచేసి ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ( సినిమా వాళ్లకు అండగా ఉంటాం: కిషన్ రెడ్డి )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ భూసేకరణ నిమిత్తం అప్పటి అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ( PM Modi govt) రూ. 76.33 కోట్లు నిధులను మంజూరు చేసింది. అయితే భూసేకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే హైదరాబాద్ నగర పాలక సంస్థ ద్వారా రహదారి విస్తరణ కోసం భూసేకరణ చేపట్టి నష్టపోయిన వారికి పరిహారం చెల్లించి సంబంధిత కాంట్రాక్టర్‌కి నిర్మాణ నిమిత్తం బదిలీ చేయవలసి ఉన్నది. కాని కాంట్రాక్ట్ నిర్ణయించి శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ.. ఇప్పటివరకు స్థల సేకరణ పూర్తి కాకపోవడంతో నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదనే విషయాన్ని కిషన్ రెడ్డి ఈ లేఖ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. Cancer patients: క్యాన్సర్‌ పేషెంట్స్‌కి కరోనా వస్తే.. ? )


అంబర్‌పేట ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో తమరే వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని సత్వరమే నిర్మాణ పనులు ప్రారంభించడానికి వీలుగా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ వెంటనే స్థల సేకరణ పూర్తి చేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విజ్ఞప్తి చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..