అండగా ఉంటాం..!!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ (శనివారం) తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  కరోనా వైరస్ వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో చర్చించారు.

Last Updated : May 23, 2020, 03:18 PM IST
అండగా ఉంటాం..!!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ (శనివారం) తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  కరోనా వైరస్ వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో చర్చించారు.

ఈ కాన్ఫరెన్స్‌లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ , జెమిని కిరణ్ , త్రిపురనేని వరప్రసాద్, వివేక్ కూచిభొట్ల ,అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి  పాల్గొన్నారు. షూటింగులకు అనుమతి, థియేటర్ల ఓపెనింగ్, క్యాప్టివ్ పవర్, పైరసీ, OTTలో సినిమా రిలీజ్, రీజనల్ జీఎస్టీ, టీడీఎస్, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ  సహా  పలు అంశాలను సినిమా ప్రముఖులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.  

వీటిపై స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి..  షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి లభిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెన్ చేయడానికి  నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అలాగే సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతీయ భాషా సినిమాలు ఎక్కువగా నిర్మాణం జరిగేలా రీజినల్ జీఎస్టీ మీద కూడా ఆలోచిస్తామన్నారు. సినిమా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం విద్యుత్ శాఖా మంత్రితో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. 

జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్ లు , స్టూడియోల నిర్మాణం కోసం ఆయా సీఎంలతో మాట్లాడి  సహాయం చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు. ఇప్పటికే వలస కార్మికుల కోసం భారీగా నిధులు విడుదల చేశామని, మధ్య, చిన్న పరిశ్రమల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలందరూ ఈ కష్టకాలంలో రాజకీయ, మత, ప్రాంత భాషా భేదాలకు అతీతంగా ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News