Hyderabad Floods: తెలంగాణలో కేంద్ర బృందం, ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
Centre Team Visits Telangana | గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
Hyderabad Rains | గత కొన్ని రోజులుగా తెలంగాణ ( Telangana ) రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నేటికీ వరదలు కొనసాగుతున్నాయి. ఎన్నో కాలనీల్లో నీరు నేటీకి ఇళ్లల్లోకి చేరుకుంటోంది. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ జలగండం నుంచి నగరాన్ని గట్టెక్కించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read | Covid-19 Vaccine: కరోనా అంతం అసంభవం అంటున్న బ్రిటిష్ శాస్త్రవేత్త
ఈ సందర్భంగా కేంద్రం నుంచి నేడు ఒక బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ వశిష్ట తో పాటు మరికొంత మంది అధికారులు ఉన్నారు. ఈ బృందం రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తుంది.
Also Read | US Elections 2020: ట్రంప్‌పై మండిపడ్డ బరాక్ ఒబామా
భాగ్యనగరంతో పాటు ప్రభావిత జిల్లాల్లో పర్యటించి ఏ మేరకు నష్టం కలిగింది అనేది తన నివేదికలో కేంద్రానికి తెలియజేస్తుంది. ఈ నివేదికలో భారీ వర్షాలు ( Hyderabad Floods ), వరదల వల్ల పంటలకు ఏ మేరకు నష్టం కలిగిందో కూడా కేంద్రం తన నివేదికలో ప్రస్తావిస్తుంది.
కేంద్ర బృందంతో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురు అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర బృందం హైదరాబాద్ ( Hyderabad) నగరంలో పర్యటిచింది. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు స్థానిక పరిస్థితుల గురించి వివరించారు.
Also Read | VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR