TRS MLA DANCE: తెలంగాణలో అధికార పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభుత్వ కార్యకమాలతో పాటు పబ్లిక్ మీటింగ్స్ లోనూ డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభకు వెళుతూ కార్ల ర్యాలీలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ కార్యక్రమంలో చిందేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఓ కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి డ్యాన్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని ఓ మాయా ఓ మాయా పాటకు తీన్మార్ స్టెప్పులు వేశారు ఎమ్మెల్యే రవిశంకర్. డీజీ సౌండ్ లో సాంగ్ వేస్తుండగా.. అదే జోష్ లో స్టెప్పులు వేశారు ఎమ్మెల్యే. రవిశంకర్ డ్యాన్స్ చేస్తుండగా టీఆర్ఎస్ నేతలు కూడా డ్యాన్స్ చేశారు. ఎమ్మెల్యే రవిశంకర్ డ్యాన్సు చేస్తున్న వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



ఎమ్మెల్యే రవిశంకర్ స్టెప్పులపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే డ్యాన్స్ లో చిరంజీవి మించిపోయారని కొందరు కామెంట్ చేశారు. మైకేల్ జాక్సన్‌ను మరిపించారని మరికొందరు అన్నారు. మరికొందరు మాత్రం ప్రజల బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యే ఇలా పబ్లిక్ గా తీన్మార్ స్టెప్పులు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు చొప్పదండి నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి మరుసటి ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ రాదు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన బొడిగే శోభకు 2018లో టికెట్ రాలేదు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. 2018లో సుంకే రవి శంకర్ కారు పార్టీ నుంచి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో రవిశంకర్ కు టికెట్ రాదనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీంతో ఆ సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ ఎమ్మెల్యే డ్యాన్స్ కు కొందరు కామెంట్ పెట్టారు.చొప్పదండి ఎమ్మెల్యే  మంచి జోష్ లో ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు అని ఫిక్స్ అయినట్టు ఉన్నారు అంటూ కొందరు సెటైరిక్ పోస్టులు పెట్టారు.


Also Read: Actress Namitha blessed with twins: నమితకు కవల పిల్లలు.. ఫోటోలు చూశారా?


Also Read: Rhea Chakraborty Hot Photos: సుశాంత్ రాజ్ పుత్ ప్రియురాలి హాట్ ట్రీట్.. అంతా కనిపించేలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి