CM KCR phone call audio leaked: హైదరాబాద్: ఈటల రాజేందర్ చాలా చిన్నోడు. ఈటల రాజేందర్‌తో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈటల రాజేందర్ గురించి మాట్లాడటం చిన్న విషయం. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి (CM KCR comments on Etela Rajender). తనుగుల గ్రామంలో దళిత నాయకుడైన రామస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన ఆడియో టేప్ లీకైంది. లీకైన ఆడియో టేప్‌లో సీఎం కేసీఆర్, రామస్వామి మధ్య జరిగిన సంభాషణ ప్రకారం.. ఈ నెల 26న ప్రగతి భవన్‌లో జరగనున్న దళిత బంధు మీటింగ్‌కి హాజరుకావాల్సిందిగా సీఎం కేసీఆర్ సదరు రామస్వామిని కోరినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రామస్వామి ఎంపిక జరిగిన తీరు గురించి అతడికి వివరించిన సీఎం కేసీఆర్ (CM KCR)... ''దళిత బంధును ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం గ్రామానికి ఇద్దరు మహిళలు, పురుషులు చొప్పున ఎంపిక చేసుకున్నామని.. అందులో ఇంటెలీజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీ పేరును చేర్చడం జరిగింది'' అని అన్నారు.


Also read : Motkupalli ‍‍‍Narsimhulu resigned to BJP: ఈటల రాజేందర్‌పై ఆరోపణలతో బీజేపికి మోత్కుపల్లి నర్సింహులు గుడ్‌బై


రామస్వామితో (CM KCR phone call to Ramaswamy) సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడుతూ.. ''దళిత బంధు పథకంపై యావత్ తెలంగాణ దళిత జాతి భవితవ్యం ఆధారపడి ఉందని, ఇది ఆషామాషీ పని కాదు.. ఒక గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఈ నెల 26న ప్రగతి భవన్‌లో జరగనున్న దళిత బంధు కార్యక్రమంలో చేయాల్సిన పనులపై మీకు ఒక అవగాహన కల్పించడం కోసం రేపు మీ జిల్లా కలెక్టర్ నుంచి మిమ్మల్ని కలెక్టరేట్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీకు ఫోన్ వస్తుందని.. కలెక్టరేటులోనే లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత ఎల్లుండి.. అంటే 26న ఉదయం మీరు జమ్మికుంట వస్తే.. అక్కడ ప్రభుత్వమే ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ చేసి, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో మీరంతా హుజురాబాద్ (Huzurabad) రావాల్సి ఉంటుందని తెలిపారు. 


హుజూరాబాద్‌లో అన్ని మండలాల దళిత నాయకులు ఏకమై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రగతి భవన్ రావాల్సి ఉంటుందని సూచించారు. ప్రగతి భవన్ వచ్చాకా దళిత బంధు (Dalitha Bandhu scheme) కార్యక్రమంతో పాటుగా భవిష్యత్తులో చేయాల్సిన అన్ని పనుల గురించి వివరంగా మాట్లాడుకోవచ్చని సీఎం కేసీఆర్ రామస్వామితో చెప్పినట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also read : Heavy rains in Telangana: వరద నీటిలో నిర్మల్.. ఇళ్లలోకి భారీగా వరద నీరు


హూజూరాబాద్ ఉప ఎన్నిక (Huzurabad bypolls) నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలన్నీ హుజూరాబాద్ కేంద్రంగానే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో లీకైన ఈ ఆడియో టేప్‌పైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.


Also read: Kaushik Reddy joins TRS: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook