CM KCR Yadadri visit: సీఎం కేసిఆర్ యాదాద్రి, వరంగల్ పర్యటనల షెడ్యూల్
KCR To Visit Yadadri, Warangal: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపటి శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి 11.30 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు.
KCR To Visit Yadadri, Warangal: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేపటి శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేసీఆర్ సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బయల్దేరి 11.30 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. యాదాద్రిలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్మీ నరసింహ్మా స్వామిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి నుండి హైదరాబాద్ బయల్దేరి ప్రగతి భవన్‌కు చేరుకుంటారు.
అక్టోబర్ 1న సీఎం కేసిఆర్ వరంగల్ పర్యటన షెడ్యూల్
అక్టోబర్ 1న శనివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరంగల్‌లో పర్యటించనున్నారు. వరంగల్‌లోని ములుగు రోడ్డులో స్థాపించిన ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సీఎం చంద్రశేఖర్ రావు పాల్గొంటారు. వరంగల్ పర్యటన కోసం శనివారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరి ఉదయం 11.15 గంటలకు వరంగల్ చేరుకుంటారు. మధ్యాహ్నం ప్రతిమ రిలీఫ్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం చేస్తారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ (CM KCR) హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు.
Also Read : Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు..వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ..!
Also Read : Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి