CM Revanth Reddy hot comments on mla sabitha indra reddy: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయాల్ని మరింత హీట్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు, గత ప్రభుత్వ పాలనలోని నిర్ణయాల వల్ల పూర్తిగా అఘాతంలోకి వెళ్లిపోయిందని ఆరోపణలు చేస్తున్ననారు. నీళ్లు,నిధులు, నియమాకాల్లో  భారీగా అక్రమాలకు పాల్పడ్డారని తెలంగాణను భ్రష్టుపట్టించారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హాయాంలో తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో వేదికగా ప్రజల ముందుంచుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు.. అంతే స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ ఇస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


కాంగ్రెస్ నేతలు తమమీద కావాలనే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, చేసిన డెవలప్ మెంట్ గురించి మాట్లాడకుండా లేనీ పోనీ అసత్యాలు తమమీద రుద్దుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. సీఎం రేవంత్ మాట్లాడుతూ... పదేళ్లపాటు కాంగ్రెస్ లో అన్నిరకాల మంత్రి పదివిని అనుభవించి, పార్టీ మారిన చరిత్ర సబితా ఇంద్రా రెడ్డిదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను కాంగ్రెస్ లోకి రావాలని సబితా చెప్పారని, మల్కాజీ గిరి నుంచి బరిలో దిగితే మద్దతు ప్రకటిస్తానని చెప్పి, తీరా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారని సీఎం రేవంత్ పలు విమర్శలు చేశారు.


అంతేకాకుండా..  కేటీఆర్ కు సూచనలు చేస్తు.. నీ వెనుకాల ఉన్న అక్కడ ఇక్కడ వాళ్లకు చెప్పి.. చెప్పి.. ముంచేసి.. అక్కడ తేలారంటూ.. కూడా సబితా ఇంద్రారెడ్డి, ఇతర మహిళా ఎమ్మెల్యేల గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడారు. దీంతో అసెంబ్లీ సభ ఒక్కసారిగా రచ్చగా మారిపోయింది. సబితా ఇంద్రా రెడ్డి కూడా రేవంత్ మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ గుండెల మీద చేయివేసి నిజం మాట్లాడాలని, గతంలో జరిగిన పలు సందర్భాలను  సభ ముందు ఉంచారు. లేనీ పోనీ ఆరోపణలు చేయోద్దంటూ కూడా  ఎమోషనల్ అయ్యారు.


Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..


ఈ క్రమంలో డిప్యూటీ మంత్రి మల్లుభట్టీ విక్రమార్క మాట్లాడుతూ.. పదేళ్లు కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, పార్టీ మారిన వారు ఏముఖం పెట్టుకుని మాట్లుడుతున్నారంటూ కూడా ఘాటు గానే స్పందించారు. ఈ నేపథ్యంలో సభలో ఒక్కసారిగా గందర గోళ వాతావరణం ఏర్పడింది. దీనిపై ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేలపై, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్నిఖండిచారు. ఇది యావత్ తెలంగాణ మహిళలోకానికి జరిగిన అవమానమని అన్నారు. వెంటనే సీఎం రేవంత్...  క్షమాపణ చెప్పాలని హరీష్ రావు ఎక్స్  వేదికగా డిమాండ్  చేస్తున్నామన్నారు.   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter